Daughter First Birthday Gift: కూతురు మీద తండ్రికి విపరీతమైన ప్రేమ ఉంటుంది. వర్ణించలేనంత ఇష్టం ఉంటుంది. చెప్పలేనంత ఆరాధన ఉంటుంది. కూతురికి కూడా తండ్రి అంటే అదే స్థాయిలో ఇష్టం ఉంటుంది.
కూతుర్ల మీద ఉన్న ప్రేమను ప్రదర్శించడానికి తండ్రులు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఇక ఇప్పటి కాలంలో తండ్రులు కూతుర్ల కోసం ఏమైనా చేయడానికి వెనుకాడటం లేదు. కూతుర్లలో మరో అమ్మను చూసుకునే తండ్రులు.. వారి బాగోగుల కోసం ఏదైనా చేస్తుంటారు. తినే తిండి నుంచి తాగే నీటి వరకు.. తొడుక్కునే దుస్తుల నుంచి.. చదువుకునే పాఠశాల నుంచి.. చేసే ఉద్యోగం వరకు ఇలా ప్రతి విషయంలోనూ తండ్రులు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. తమ కూతుర్లకు ఎలాంటివి సరిపోతాయో ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. సరిపోయిన తర్వాత గాని ఆ నిర్ణయం తీసుకోరు. ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో తన కూతురికి ఓ తండ్రి అదిరిపోయే బహుమతిచ్చాడు. తన కూతురు తొలి పుట్టినరోజు అంగరంగ వైభవంగా చేసిన అతడు.. కనీ విని ఎరగని స్థాయిలో బహుమతి ఇచ్చి సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు.
Also Read: Atress Hema Daughter: సీనియర్ నటి హేమ కూతురు ఎలా ఉందో చూశారా…స్టన్నింగ్ ఫోటోలు వైరల్…
సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం దుబాయ్ లోని స్థిరపడిన భారతీయ వ్యాపారి తన కుమార్తె తొలి పుట్టినరోజును అత్యంత ఘనంగా చేశాడు. అత్యంత విలువైన బహుమతి ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.. దుబాయ్ ప్రాంతంలో స్థిరపడిన భారతీయ వ్యాపారి సతీష్ సన్పాల్ కు కూతురు ఇసబెల్లా ఉంది. ఆమె తొలి పుట్టిన రోజును సతీష్ అంగరంగ వైభవంగా నిర్వహించాడు. అంతేకాదు ఆమెకు గులాబీ రంగు లో ఒక కారును బహూకరించాడు. ఇంగ్లాండ్ నుంచి ఈ కారును దిగుమతి చేసుకున్నారు. దీని ధర 10 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. పూర్తిగా గులాబి రంగులో ఈ కారును రూపొందించారు. ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. తన కుమార్తె పేరును ఈ కారులో సీట్లకు.. ఇతర పరికరాలపై నమోదు చేయించాడు సతీష్. అంతేకాదు పింక్ కలర్ లో రూపొందించిన అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్ కేక్ ను కట్ చేయించాడు.
” కుమార్తెలంటే ఈ భూమి మీద ఉన్న తండ్రులకు విపరీతమైన ప్రేమ. కుమార్తెలలో వారు తమ అమ్మను చూసుకుంటారు. అందువల్లే వారిపై విపరీతమైన ప్రేమను కనబరుస్తుంటారు. వారికి ఖరీదైన కానుకలు ఇచ్చి సంతోష పెడుతుంటారు. వారి సంతోషంలో తమ ఆనందాన్ని వెతుక్కుంటారు. అందువల్లే తండ్రులు తమ కూతుర్లకు సంబంధించిన ఏ వేడుకనైనా సరే అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. అలాంటిదే ఇది కూడా. ఆ తండ్రి తన కూతుర్ని చూసి ఆనంద పడుతుంటే.. ఆ కూతురు తన తండ్రిని సంతోష పెడుతున్నది. ఈ వీడియో చూస్తుంటే కళ్ల వెంట అదే పనిగా నీళ్లు కారుతున్నాయని” నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.