Canada Vs India: కెనడాతో గొడవ.. అక్కడ మనవారి పరిస్థితి ఏంటి..?

ఏడాది కాలంగా భారత్‌–కెనడా మధ్య సంబంధాలు క్షిణిస్తున్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య తర్వాత విభేదాలు మొదలయ్యాయి. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీరుతో ఇటీవల దౌత్య సంబంధాలు మరింత పతనమయ్యాయి.

Written By: Raj Shekar, Updated On : October 18, 2024 3:23 pm

Canada Vs India(2)

Follow us on

Canada Vs India: ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్‌ నిజ్జర్‌ కెనడాలో గతేడాది హత్యకుగురయ్యాడు. దీని వెనుక భారత హైకమిషనర్‌ ప్రతినిధుల హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది. దీనిని భారత్‌ ఖండించింది. ఆధారాలు ఇవ్వాలని కోరింది. ఏడాది గడిచినా ఆధారాలు ఇవ్వని కెనడా, తాజాగా మళ్లీ అవే ఆరోపణలు చేసింది. భారత హైకమిషనర్‌ సంజయ్‌కుమార్‌వర్మ పేరును నిజ్జర్‌ హత్యకేసు అనుమానితుల జాబితాలో చేర్చింది. దీనిపై భారత్‌ మండిపడింది. కెనడాలోని భారత రాయబారులను వెనక్కు రావాలని సూచించింది. ఇదే సమయంలో మన దేశంలోని కెనడా రాయబారులను బహిష్కరించింది. అక్టోబర్‌ 19 వరకు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. దీంతో భారత్, కెనడా దేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిన్నాయి. విభేదాలు రోజు రోజుకూ ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడాలోని భారతీయు పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. కెనడాలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇమ్మిగ్రేట్స్‌ భారతీయులు నాలుగోస్థానంలో ఉండడం గమనార్హం. అధిక సంఖ్యలో సిక్కులు అన్నిరంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. కెనడా ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్నారు. ఇరుదేశాల మధ్య వ్యాపార లావాదేవీలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులు తమపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అని కెనడాలోని భారతీయులు ఆందోళన చెందుతున్నారు. విద్య, ఉద్యోగాల కోసం కెనడాకు వెళ్లినవారి కుటుంబాలు కూడా టెన్షన్‌ పడుతున్నాయి.

మనోళ్లే ముందు
2021 అధికారిక లెక్కల ప్రకారం కెనడాలో నివసిస్తున్న భారత వలసదారుల సంఖ్య 28 లక్షలు. వీరిలో భారత సంతతికి చెందినవారు 18 లక్షలు. ఎన్నారైలు మరో 10 లక్షల మంది ఉన్నారు. కెనడాలో 7.3 లక్షల మంది హిందువులు ఉండగా, 7.7 లక్షల మంది సిక్కులు ఉన్నారు. కెనడాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువ. ప్రస్తుతం 4.27 లక్షల మంది విద్యార్థులు కెనడాలో చదువుకుంటున్నారు. తాత్కాలికంగా ఉపాధి పొందుతుఆన్నరు. శాశ్వత నివాసం ప్రకటించిన పీఆర్‌ పథకం కింద అత్యధికంగా 27 శాతం మంది భారతీయ లబ్ధిదారులు ఉన్నారు.

ఆ నగరాల్లోనే ఎక్కువ
కెనడా పౌరసత్వం తీసుకున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2017లో 44.3 శాతం ఉండగా, 2018లో 49.2 శాతం, 2019లో 55.8 శాతం, 2020లో 58.4 శాతం, 2021లో 61.01 శాతంగా ఉంది. ఇక భారతీయులు ఎక్కువగా కెనడాలోని వాంకోవర్, టోరంటో, ఒట్టావా, వినీపెగ్, కాల్గారి, మాంట్రియల్‌ నగరాల్లో స్థిరపడ్డారు. కెనడాలో ఉన్న భారతీయుల్లో 50 శాతం మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో 19 శాతం మంది మేనేజ్‌మెంట్‌ స్థాయి జాబ్‌ చేస్తున్నారు. కెనడాకు పన్ను చెల్లిస్తున్న భారతీయులు 42 వేల మంది ఉన్నారు.

వాణిజ్యంపై ప్రభావం
భారత్‌–కెనడా దేశాల మధ్య 2023–24 మధ్య క ఆలంలో 8.9 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. కెనడా–భారత్‌ మధ్య జరిగే ఎగుమతుల విలువ 4.4 బిలియన్‌ డాలర్లు కాగా, కెనడా నుంచి ఇండియాకు జరిగే దిగుమతుల విలువ 4.5 బిలియన్‌ డాలర్లు. కెనడా నుంచి భారత్‌కు ఎక్కువగా పప్పులు ఎగుమతి అవుతాయి. తాజాగా ఇరు దేశాల సంబంధాలు దెబ్బతినడంతో కొనుగోలుదారులు ఆస్ట్రేలియా నుంచి దిగుమతులు పెంచారు. ఇక భారత్‌ నుంచి కెనడాకు ఆభరణాలు, విలువైన రాళ్లు, రెడీమేడ్‌ దుస్తులు, ఫార్మా ఉత్పత్తులు ఎగమతి అవుతాయి. కాఫీ చెయి¯Œ టిమ్‌హార్టన్, ప్రొజోన్‌ ఫుడ్‌ కంపెనీల మెక్కెయిన్‌ సహా ఇండియాలోని 600పైగా కెనడా కంపెనీలు ఉన్నాయి. ఇండియాలో కెనడా పెన్షన్‌ ఫండ్స్‌ పెట్టుబడులు 75 బిలియన్‌ డాలర్లకు పైనే ఉన్నాయి.