https://oktelugu.com/

Diwali 2024: దీపావళి రోజు ఈ వస్తువులు ఇంటికి తీసుకొచ్చారా.. దరిద్ర దేవత ఇంట్లో ఫిక్స్!

దీపావళి పండుగ రోజు కొన్ని నియమాలు పాటించాలి. కొందరు తెలియక కొన్ని వస్తువులను దీపావళి రోజు ఇంటికి తీసుకొస్తారు. వీటి వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఉండిపోతుంది. ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే దీపావళి కొన్ని వస్తువులను అసలు ఇంటికి తీసుకురాకూడదు. మరి ఆ వస్తువులు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 18, 2024 2:51 pm
Diwali 2024

Diwali 2024

Follow us on

Diwali 2024: అందరూ ఎదురు చూసే దీపావళి పండుగ వచ్చేస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే టపాసులు కాల్చి చాల ఆనందంగా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజు లక్ష్మీ దేవిని భక్తితో పూజిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. దీపావళి మొదలు అవుతుందంటే వారం రోజుల నుంచే సందడి మొదలు అవుతుంది. టపాసులు కాల్చుతూ ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే దీపావళి పండుగ రోజు కొన్ని నియమాలు పాటించాలి. కొందరు తెలియక కొన్ని వస్తువులను దీపావళి రోజు ఇంటికి తీసుకొస్తారు. వీటి వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఉండిపోతుంది. అసలు దీపావళి రోజు కొన్ని వస్తువులు కొని, ఇంటికి తీసుకువస్తే లక్ష్మీ దేవి మీ మీద ఆగ్రహంగా ఉంటుంది. దీనివల్ల మీరు ఏ పని చేసిన కూడా ఆటంకమే కలుగుతుంది. కాబట్టి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే దీపావళి కొన్ని వస్తువులను అసలు ఇంటికి తీసుకురాకూడదు. మరి ఆ వస్తువులు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.

విరిగిపోయిన కొన్ని వస్తువులు
విరిగిపోయిన గాజు పాత్రలను, ఫర్నిచర్, పనికి రాని వస్తువులను అసలు కొనకూడదు. ఇంట్లోకి తీసుకురాకూడదు. వీటిని ఇంట్లోకి తీసుకురావడం వల్ల దురదృష్టం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఆర్థికంగా బాగా ఇబ్బంది పడి, ఉన్న డబ్బులను పోగోట్టుకుని నష్టాల్లోకి వెళ్తారని పండితులు అంటున్నారు. కాబట్టి దీపావళి పండుగ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరాని, విరిగిపోయిన వస్తువులను ఇంట్లోకి తీసుకురావద్దు.

నల్లని వస్తువులు
దీపావళి పండుగ రోజు ఇంట్లోకి నల్ల రంగుల వస్తువులను అసలు తీసుకురావద్దు. నల్లని వస్తువులను తీసుకురావడం వల్ల నెగిటివిటీ ఏర్పడుతుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా ఏర్పడతాయి. నల్లగా, ముదురు రంగులో ఉన్న వస్తువులను కూడా దీపావళికి అసలు ఇంటికి తీసుకురాకపోవడం మంచిది.

సెకండ్ హ్యాండ్ వస్తువులు
ఎక్కువ మంది సెకండ్ హ్యాండ్ వస్తువులను వాడుతున్నారు. కొత్త వాటికి డబ్బులు పెట్టి కొనలేక సెకండ్స్‌లో కొంటున్నారు. అయితే దీపావళి రోజు అసలు ఇంటికి సెకండ్ హ్యాండ్ వస్తువులు తీసుకురావద్దు. అల్రెడీ వాడిన వస్తువులను తీసుకురావడం వల్ల శుభం జరగదని, అన్నింట్లో ఆటంకం కలుగుతుందని పండితులు అంటున్నారు. ఇదే కాకుండా ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారని అంటున్నారు. కాబట్టి సెకండ్ హ్యాండ్‌లో కొన్న వస్తువులను అసలు ఇంట్లోకి దీపావళి రోజు తీసుకురావద్దు.

పదునుగా ఉన్న వస్తువులు
సూది, చాకు, కత్తులు, కొడవలి, కత్తెర వంటి పదునుగా ఉన్న వస్తువులను అసలు దీపావళి పండుగ రోజు కొనకూడదు. అలాగే ఇంట్లోకి కూడా తీసుకురాకూడదు. వీటిని ఇంట్లోకి తీసుకురావడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. ఇంట్లో ఎక్కువగా గొడవలు వచ్చి విడిపోతారని పండితులు అంటున్నారు.

పాత ఫొటోలు
విరిగిపోయిన ఫొటో ఫ్రేమ్‌, పాత ఫొటోలు వంటి వాటిని దీపావళి పండుగ రోజు ఇంట్లోకి తీసుకురావడం వల్ల అశుభంగా భావిస్తారు. ఇంకా ఇంట్లో కొత్తగా సమస్యలు పుట్టుకొస్తాయని అంటుంటారు. లేనిపోని కొత్త సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. కాబట్టి అసలు పాత ఫొటోలను ఇంట్లోకి తీసుకురావద్దు.

రిపైర్ చేసిన గడియారాలు
చేతి వాచ్ లేదా గోడ గడియారాలు పనిచేయకపోతే బ్యాటరీ వేయించుకుంటాం. కానీ కొందరు ఇలాంటి గడియారాలను ఇంట్లోనే ఉంచుకుంటారు. ఇలా వీటిని ఉంచుకోకూడదు. అలాగే రిపైర్ చేయించి దీపావళి పండుగ రోజే ఇంటికి తీసుకురాకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి పనికి రాని గడియారాలను ఇంట్లో ఉంచుకోవద్దు. బయట పడేయడం మంచిది.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు పండితులను సంప్రదించగలరు.