Christmas Island
Christmas Island : సువిశాల విశ్వంలో ఎన్నో తెలియని విశేషాలు చాలా ఉన్నాయి. మన జీవిత కాలంలో ఈ భూమ్మీద ఉన్న వింతలను చూసేది 100లో ఒక శాతం మాత్రమే. ఒక్కోసారి మన పక్కనే ఉన్న వింతలను కూడా చూడలేని పరిస్థితి ఉంటుంది. అలాంటిదే మన దేశం పక్కన ఉన్న ఓ ద్వీపం. హిందూ మహాసముద్రంలో విశాలమైన విస్తీర్ణంలో ఉన్న ఒక చిన్న ద్వీపం ఉంది. అదే క్రిస్మస్ ద్వీపం(Christmas Island). ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు వాయువ్యంగా 2,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వీపానికి క్రిస్మస్ పేరు ఎందుకు పెట్టారు?.. అక్కడికి వెళ్లేవారికి ఇది ఎలాంటి అహ్లాదకర వాతావరణాన్ని సంపదను అందిస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
క్రిస్మస్ ద్వీపం అసలు పేరు కిరిటిమతి. దాదాపు 388 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బ. ఇది కిరిబాటి రిపబ్లిక్‌లో భాగం.. హవాయికి దక్షిణంగా దాదాపు 2,150 కిలోమీటర్ల దూరంలో మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇది అనేక చిన్న చిన్న ద్వీపాలను కలిగి ఉంటుంది. ఇది పర్యావరణ పరంగా ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుంది.
AlSo Read : భూమిపై అత్యంత మారుమూల ద్వీపం.. ఎక్కడుంది.. ఎంతమంది నివసిస్తున్నారో తెలుసా ?
1777లో క్రిస్మస్ ఈవ్ నాడు కెప్టెన్ జేమ్స్ కుక్ దీనిని కనుగొన్నారు. ఈ కిరిటిమతి ద్వీపానికి గొప్ప చరిత్ర ఉంది. ప్రపంచ యుద్ధాల సమయంలో అంటే 1950లు , 1960లలో ఈ ద్వీపాన్ని యునైటెడ్ కింగ్‌డమ్, తరువాత యునైటెడ్ స్టేట్స్ అణు పరీక్షల కోసం ఉపయోగించాయి. అయినప్పటికీ, ఈ ద్వీపం సముద్ర పక్షుల కాలనీలు , పలు రకాల సముద్ర జంతువులు, విభిన్న వన్యప్రాణాలకు నిలయంగా ఉంది.
కిరిటిమతి జనాభా తక్కువగా ఉంటుంది. దాదాపు 6,500 మంది మాత్రమే నివసిస్తున్నారు. వీరంతా చిన్న గ్రామాలలో నివసిస్తున్నారు. ద్వీపంలో జీవించే ప్రజల జీవనాధారం చేపలు పట్టడం, కొబ్బరి ఉత్పత్తి , పర్యాటక పరిశ్రమపై ఆధారపడి జీవిస్తుంటారు. పక్షులను చూడటం, చేపలు పట్టడం, డైవింగ్ చేయడంలో ఆసక్తి ఉన్న పర్యాటకులకు ఈ ద్వీపం చాలా ముచ్చటగొలుపుతుంది. అహ్లాదకర వాతావరణం కారణంగా కిరిటిమతి ప్రపంచ సముద్ర పక్షుల సంరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఈ ద్వీపానికి ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే అన్ని దేశాల కంటే ముందే కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటుంది. అందుకే కిరిటిమతి ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. సహజ సౌందర్యానికి చారిత్రక ప్రాముఖ్యతను కలిగిఉంది.