Chinese Women: ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావిడి చేస్తే పెద్దగా ఉపయోగ ఉండదు కదా.. ఈ సామెత ఇప్పుడు ఈ యువతికి అనుభవంలోకి వచ్చింది. ఏదో చేయాలి అనుకుంది. చివరికి ఆమె పరిస్థితి ఇలా మారిపోయింది.
మనలో చాలామందికి అందంగా ఉండాలని.. సన్న జాజి తీగలాగా కనిపించాలని ఉంటుంది. కాకపోతే, తినే తిండి విషయంలో చాలామంది జాగ్రత్తగా వహించరు. ఇష్టానుసారమైన ఆహారాన్ని తింటూ బరువు పెరుగుతుంటారు. పెరిగిన బరువులు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో కొన్ని ప్రయత్నాలు సానుకూలంగా ఉంటే.. మరికొన్ని ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తుంటాయి.
లావుగా ఉన్న ఓ యువతి తన బరువును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది. అవన్నీ విఫలమయ్యాయి. చివరికి తన స్నేహితురాలి వివాహం ఉండడంతో ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. కొద్దిరోజుల్లోనే బరువు తగ్గి పెళ్ళి కుమార్తె కంటే తనే అందంగా కనిపించాలని నిర్ణయించుకుంది. దానికి తగ్గట్టుగా ప్రతిరోజు 10 కిలోమీటర్ల పాటు పరుగు పెట్టింది. తక్కువ మొత్తంలోనే కూరగాయలు, చికెన్ తినడం ప్రారంభించింది.
ఇలా చేయడం వల్ల ఆమె ఏకంగా రెండు నెలల్లో 15 కిలోల బరువు తగ్గింది. ఆమె తన డైట్ లో కార్బోహైడ్రేట్స్ ను పూర్తిగా తగ్గించింది. ఆ యువతి పూర్తిగా హై ఇంటెన్ సిటీ ఎక్సర్ సైజ్ చేయడంతో ఫ్రీ డయాబెటిక్ బారిన పడింది. తరచుగా దాహం వేయడం.. విపరీతమైన ఆకలితో ఇబ్బంది పడింది. దీంతో ఆమె వైద్యులను సంప్రదించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు.. డైట్ ఆపేయమని హెచ్చరించారు. ఇదే కొనసాగిస్తే మాత్రం ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించారు.
వాస్తవానికి బరువు తగ్గే క్రమంలో చాలామంది ఆహారాన్ని పూర్తిగా నియంత్రిస్తుంటారు. సోషల్ మీడియాలో కనిపించే సమాచారాన్ని గుడ్డిగా నమ్మి.. అర్ధాకలితో ఇబ్బంది పడుతుంటారు. అంతేకాదు కొన్ని సందర్భాలలో నీరసం ఎదురైనప్పటికీ కూడా బరువు తగ్గాలని భావిస్తుంటారు. అలాకాకుండా వైద్యుల సూచనలు పాటిస్తూ.. డైట్ కొనసాగిస్తూ ఉంటే బరువు తగ్గుతారు. వ్యాయామాన్ని ఒక క్రమ పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తే శరీరంలో ఉన్న బరువు తగ్గుతుందని.. శరీరానికి సంబంధించిన అనేక రకాలైన జీవనక్రియలు మరింత ఉత్తేజితంగా మారుతాయి అని వైద్యులు చెబుతున్నారు.