China
China: సజాతి ధ్రువాలు వికర్షించుకోవాలి.. విజాతి ధ్రువాలు ఆకర్షించుకోవాలి. చిన్నప్పుడు భౌతిక శాస్త్రంలో చదువుకున్న ఈ పాఠం గుర్తుంది కదా.. మన నిజ జీవితంలో కూడా ఇదే వర్తిస్తుంది.. ఆడ, మగ కలిస్తేనే సృష్టికార్యం జరుగుతుంది. ఆ తర్వాత తదుపరి సంతతి ఏర్పడుతుంది. కానీ చైనా యువతులకు (China ladies) విభిన్నమైన ఆలోచన వస్తోంది. అది కాస్త చర్చకు దారి తీస్తోంది.
చైనా లో ఏం జరిగినా సంచలనమే. అక్కడ ప్రస్తుతం డీప్ సీక్( Deep seak) సంచలనం సృష్టిస్తున్నది..చాట్ జిపిటి(CHAT GPT), గూగుల్ జెమిని( Google GEMINI) కి తీవ్రమైన పోటీస్తోంది. డీప్ సీక్ వెలుగులోకి వచ్చిన తర్వాత అమెరికన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. యూరప్, ఆసియా, ఇతర మార్కెట్ల పరిస్థితి కూడా ఇలానే మారిపోయింది. చివరికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) రంగంలోకి దిగాల్సి వచ్చింది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికన్ కంపెనీలను ముందు వరుసలో నిలపాలని పిలుపునిచ్చారు. అయినప్పటికీ డీప్ సీక్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు.. అయితే డీప్ సీక్ తోపాటు చైనాలో ” లవ్ అండ్ డీప్ స్పేస్(love and deep space)” అనే డేటింగ్ సిమ్యులేషన్ (dating simulation) ట్రెండింగ్లో ఉంది. ఇందులో ఏకంగా ఆరు మిలియన్ల మంది యాక్టివ్ గా ఉన్నారు. ఇందులో అమ్మాయిలు ఎక్కువగా ఏఐ బాయ్ ఫ్రెండ్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. అమ్మాయిలు పంపిన సందేశాలకు రిప్లై ఇవ్వడం, కాల్స్ చేయడం, వారు ఇంతసేపు మాట్లాడినప్పటికీ ఓపికగా వినడం వంటివి ఏఐ(artificial intelligence) చేస్తోంది. ఈ యాప్ ను యో రనావో(yo ranavo) సృష్టించారు. ఈ యాప్ ట్రెండింగ్లో ఉండడంతో ఆయన ఒక్కసారిగా బిలియనీర్ అయిపోయారు.
అందుకోసమే అమ్మాయిలు అటు వైపు చూస్తున్నారట
చైనా దేశంలో అమ్మాయిలు ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాయ్ ఫ్రెండ్స్ వైపు మొగ్గు చూపడానికి.. వారు ఎంత సేపు మాట్లాడిన ఓపికగా వినడం.. కాల్స్ చేయడం.. మెసేజ్లకు రిప్లై ఇవ్వడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి.. అందువల్లే అమ్మాయిలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాయ్ ఫ్రెండ్స్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు..” కాలం మారుతోంది. అమ్మాయిలు తమకు నచ్చిన వారిని ఎంచుకొనే స్వాతంత్రం వచ్చింది. అలాంటప్పుడు వారు తమకు నచ్చినట్టుగా.. తమకు నచ్చినట్టుగా ఎదుటి మనుషులు ఉండాలని కోరుకుంటున్నారు. తమ జీవిత భాగస్వాములు, కాబోయే భాగస్వాములు తమకు అనుకూలంగా ఉండాలని భావిస్తున్నారు. అందువల్లే వారు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ బాయ్ ఫ్రెండ్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారని” చైనా టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.
విరహవేదనతో..
తమకు నచ్చిన లక్షణాలు ఉన్న అబ్బాయిలు లభించకపోవడం.. ఒకవేళ అలాంటి లక్షణాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో తమను దూరం పెట్టడం.. వంటివి చైనా అమ్మాయిలు విరహవేదనను పెంచుతున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. అందువల్లేవారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాయ్ ఫ్రెండ్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారని అంటున్నారు.. తమకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలో క్రియేట్ చేసుకునే అధికారం వారికి ఉన్న నేపథ్యంలో.. ఈ యాప్ లోనే మునిగి తేలుతున్నారని చైనా మీడియా చెబుతోంది.. మొత్తానికి ప్రపంచంలో ఏది జరిగినా అది అంతిమంగా చైనా వైపే చూపిస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఏకంగా మానవ సంబంధాలను కూడా ప్రభావితం చేస్తోంది చైనా. సాంకేతిక రంగంలో ఇంకా ఎన్నెన్ని ప్రయోగాలు చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.