Tesla Cybertruck 2026: Tesla కంపెనీ వాహనాలు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఆకట్టుకుంటున్నాయో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వానికి అవసరాల కోసం ట్రక్కులను కూడా ఈ కంపెనీ వినియోగదారుల ముందు ఉంచుతోంది. ఇప్పటికే టెస్లా నుంచి వచ్చిన సైబర్ ట్రక్ పిక్ అప్ కు కొనసాగింపుగా 2026 పేరుతో కొత్త ట్రక్కును ఏర్పాటు చేసింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో పాటు ఆల్ ఎలక్ట్రిక్ పవర్ ట్రే ఇన్ తో రోడ్డుపై ఉన్న ప్రతి సాంప్రదాయ ట్రక్కుకు ఇది భిన్నంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో పలు అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీనిని అప్గ్రేడ్ చేసి మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ఈ ట్రక్ వారి అవసరాలకు ఉపయోగించేవారికి తప్పకుండా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
టెస్లా సైబర్ టక్ పిక్ అప్ 2016 బాహ్య డిజైన్ విషయానికి వస్తే.. దీనిని ఆల్ట్రా హార్డు స్టెయిన్ లెస్ స్టీల్ బాడీ తో తయారు చేశారు. పదునైన అంచులు, ఫ్లాట్ ప్యానెల్ మరింత ఆకర్షణగా ఉంటాయి. నిరంతరం వెలిగే LED లైట్స్ ఆకర్షిస్తాయి. ఇది ఇప్పటివరకు ఏ ఇతర వాహనాలలో కనిపించలేదు. అలాగే ఎక్సో స్కెలిటన్ శైలి బాడీ కి రక్షణగా ఉంటుంది. కఠినమైన వాతావరణాన్ని సైతం ఇవి తట్టుకుంటాయి. ఈ సైబర్ ట్రక్ ఇంటీరియర్ డిజైన్ గురించి చర్చిస్తే.. ఇందులో విశాలమైన క్యాబిన్ ఉంటుంది. ఆకట్టుకునే డాష్ బోర్డు, సౌకర్యవంతమైన టచ్ స్క్రీన్, ఇంటీరియర్ మెటీరియల్స్ సౌకర్యాన్ని అందిస్తాయి. రాష్ గా డ్రైవ్ చేసేవారికి కూడా ఇది అనుగుణంగా ఉంటుంది. ఇందులో 360 డిగ్రీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన డ్రైవర్ కు రక్షణ వ్యవస్థను ఉంచారు. ఓవర్ ది ఎయిర్ అప్డేట్, వాయిస్ కంట్రోల్, అప్డేట్ నావిగేషన్ ఉండడంతో డ్రైవర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది.
టెస్లా సైబర్ ట్రక్ పెద్ద కార్గో బెడ్ తో తయారు చేయబడింది. దీంతో ఇందులో భారీగా సామాగ్రిని తీసుకు వెళ్ళేందుకు అనుగుణంగా ఉంటుంది. పవర్ లేఅవుట్, క్యాంపింగ్, బహిరంగ కార్యకలాపాలకు అనుగుణంగా ఉంటుంది. 14,000 పౌండ్ల వరకు టోయింగ్ సామర్థ్యం అందించే ఇది ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం కావడంతో ఒకసారి చార్జింగ్ చేస్తే 500 మైళ్ల వరకు ప్రయాణం చేయవచ్చు. అలాగే ఒకేసారి ఇందులో ఆరుగురు ప్రయాణికులు వెళ్లవచ్చు. భవిష్యత్తులో ప్రతి వాహనం ఎలక్ట్రిక్ మయం కావడంతో వాణిజ అవసరాల కోసం ట్రక్కులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలతో రావడం వల్ల చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ తరుణంలో టెస్లాస్ సైబర్ ట్రక్ లేటెస్ట్ టెక్నాలజీతో అలరించనుంది.