Laila
Laila : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో ఒకరు విశ్వక్ సేన్(Vishwak Sen). ‘ఈ నగరానికి ఏమైంది'(Ee Nagaraniki Emaindi), ‘ఫలక్ నూమా దాస్’, ‘హిట్ : ది ఫస్ట్ కేస్’, ‘ఆకాశవనంలో అర్జున కళ్యాణం’, ‘దాస్ కా ధమ్కీ’, ‘గామీ’ ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని మన టాలీవుడ్ కి అందించి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని, బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. కానీ ఈమధ్య కాలం లో ఆయన నుండి వస్తున్న సినిమాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. ‘మెకానిక్ రాకీ’ చిత్రం తో అట్టర్ ఫ్లాప్ ని అందుకున్న ఆయన, ఇప్పుడు తాజాగా ‘లైలా'(Laila Movie) చిత్రంతో మరో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్నాడు. విడుదలకు ముందు పలు వివాదాల్లో చిక్కుకొని వివాదాస్పదం గా మారిన ఈ సినిమా, కనీసం ఓపెనింగ్స్ ని కూడా సొంతం చేసుకోలేదు.
మొదటి రోజు నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న విశ్వక్ సేన్ సినిమాకి , మూడు రోజులకు కలిపి కనీసం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదని ట్రేడ్ చెప్తుండడం గమనార్హం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మూడు రోజులకు కలిపి కేవలం 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. సినిమాకి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా..? , అక్షరాలా పాతిక కోట్ల రూపాయిలు. అంత థియేట్రికల్ బిజినెస్ కూడా ఈ సినిమాకి జరగలేదు. కేవలం 12 కోట్ల రూపాయలకు మాత్రమే అమ్ముడుపోయింది. డిజిటల్ + సాటిలైట్ రైట్స్ ద్వారా 15 కోట్ల రూపాయిలు నిర్మాతకు వెళ్ళింది కానీ, థియేట్రికల్ రిలీజ్ మాత్రం మొత్తం అడ్వాన్స్ బేసిస్ మీద మాత్రమే జరిగింది. అంటే థియేటర్స్ నుండి వచ్చే వసూళ్ళలో కొంత లాభం మాత్రమే నిర్మాతకు వెళ్తుంది.
అలా థియేటర్స్ నుండి మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రం ద్వారా నిర్మాతకు ఒక్క పైసా కూడా వెళ్ళలేదంటే, ఈ చిత్రం ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. విశ్వక్ సేన్ సినిమా అంటే ఆడియన్స్ లో కొన్ని అంచనాలు ఉంటాయి. ఇలాంటి దారుణమైన సినిమాలు తీస్తే ఆయన మార్కెట్ పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ సినిమా ఆయనకీ ఒక్క పెద్ద వార్నింగ్ బెల్. పద్దతి మార్చుకోకుంటే ఎంత తొందరగా అయితే ఇండస్ట్రీ లో ఆయన ఎదిగాడో, అంతే తొందరగా కనుమరుగు అయిపోవడం పక్కా. మరి రాబోయే రోజుల్లో తన కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటాడో చూడాలి. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలతో ఆయన కం బ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. అభిమానులు అయితే కం బ్యాక్ ఇస్తాడనే బలంగా నమ్ముతున్నారు.