https://oktelugu.com/

China Vs India: భారత మిత్ర దేశాల్లో చిచ్చు పెడుతున్న డ్రాగన్‌.. మయన్మార్‌ నుంచి బంగ్లాదేశ్ వరకు..

డ్రాగన్‌ కంట్రీ.. ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా గల దేశం. అభివృద్ధిలోనూ దూసుకుపోతోంది. అయితే.. ఆ దేశం దక్షిణాసియాలో బలంగా ఉన్న భారత్‌ను దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తోంది. ఇందలో భాగంగా భారత మిత్రదేశాల్లో చిచ్చు పెడుతోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 10, 2024 4:01 pm
    China Vs India

    China Vs India

    Follow us on

    China Vs India: భారత్‌ టార్గెట్‌గా చైనా పాకిస్తాన్‌తో కలిసి కొత్త ఎత్తుగడలు వేస్తోంది. అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్‌లో అల్లర్లు, అశాంతి సృష్టించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కోవిడ్‌ సమయంలో చైనా యాప్‌లపై భారత్‌ నిషేధం విధించింది. ఇక చైనా లోన్‌ యాప్‌లను బ్యాన్‌ చేసింది. ఈ క్రమంలో చైనాకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగింది. దీంతో భారత భూభాగాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది. సరిహదులను మారుస్తూ మ్యాప్‌లు విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే కోవిడ్‌ సమంలో గాల్వన్‌లోకి చొచ్చుకొచ్చేందుకు చైనా సైన్యం యత్నించింది. దీనిని భారత సైన్యం దీటుగా తిప్పి కొట్టింది. అప్పటి నుంచి చైనాకు కంటిమీద కునుకు ఉండడం లేదు. భారత్‌ను ఎలాగైనా దెబ్బతీయాలని దొడ్డి దారిని ఎంచుకుంది. ఇందుకోసం భారత మిత్ర దేశాలను దూరం చేసే కుట్ర పన్నుతోంది. ఇందుకు పాకిస్తాన్‌ సహాయం తీసుకుంటోంది. అందులో భాగమే ప్రస్తుతం బంగ్లాదేశ్‌ అల్లరు. బంగ్లాలోని షేక్‌హసీనా ప్రభుత్వం భారత్‌తో మంచి స్నేహబంధం కొనసాగిస్తోంది. దీంతో దీనిని దెబ్బతీయడానికే చైనా పాకిస్తాన్‌ సహాయంతో కుట్ర పన్నింది. ఈ క్రమంలోనే రిజర్వేషన్ల అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంది. సోషల్‌ మీడియాలో ఈ రిజర్వేషన్లకు సంబంధించిన గొడవను వైరల్‌ చేస్తూ బంగ్లాదేశ్‌ యువతను రెచ్చగొట్టింది. ఈ క్రమంలోనే మూడు నెలలుగా జరుగుతున్న అల్లర్లు.. చివరకు ప్రధాని షేక్‌ హసీనాను గద్దె దించే వరకు వచ్చాయి. భయంతో ఆమె దేశం విడిచి పారిపోయేలా చేశాయి.

    అయినా ఆగని అల్లర్లు..
    రిజర్వేషన్ల అంశమే అల్లర్లకు కారణమైతే.. షేక్‌ హసీనా రాజీనామా తర్వాత అవి సద్దుమణగాలి. కానీ, ఇప్పటికీ అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వెయ్యి మంది వరకు మరణించారు. ప్రస్తుతం మైనారిటీలు, హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ఆలయాలను ధ్వంసం చేశారు. హిందువులను చంపుతున్నారు. పరిస్థితి చూస్తుంటే ఈ అల్లర్ల ఉద్దేశం రిజర్వేషన్లు కాదని, దేశంలో అలజడి సృష్టిండచమే అని తెలుస్తోంది. తద్వారా భారత్‌లో అలజడి సృష్టించడమే అని తెలుస్తోంది అందుకే షేక్‌ హసీనా రాజీనామా చేసినా.. అల్లర్లు ఆగడం లేదు. భారత్‌తో బంగాదేశ్‌కు ఉన్న వ్యాపార సంబంధాలను దెబ్బతీయడం, భారత వ్యతిరేక ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా చైనా పాకిస్తాన్‌తో కలిసి కుట్ర చేసిందని తెలుస్తోంది. ఇక బంగ్లాదేశ్‌కు తర్వాత ఆర్థికసాయం, రుణాలు ఇచ్చి అక్కడ పాగా వేయాలన్నదే చైనా కుట్రగా తెలుస్తోంది.

    గతంలో మయన్మార్, శ్రీలంక, మాల్దీవుల్లో..
    చైనా గతంలో మయన్మార్, శ్రీలంక, మాల్దీవుల్లోనూ ఇదే ఎత్తగడ వేసి సక్సెస్‌ అయింది. మయన్మార్‌లో ఆంగ్‌సాంగ్‌సూకీ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చింది. సైనిక ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించింది. ఇక శ్రీలంకకు కూడా భారీగా రుణాలు ఇచ్చింది. అవి తీర్చలేని పరిస్థితిలో శ్రీలంకలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి ఆ దేశంపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. ఇక మాల్దీవులు కూడా ఇప్పటికే చైనా చేతుల్లోకి వెళ్లింది. గతంలో ఈ మూడు భారత మిత్ర దేశాలే. వీటిని భారత్‌కు దూరం చేయడమే లక్ష్యంగా పన్నిన కుట్రలో కొంత వరకు చైనా సక్సెస్‌ అయింది. అందుకే ఇప్పుడు మరో మిత్ర దేశమైన బంగ్లాదేశ్‌పై పడింది. సైలెంట్‌గా ఉంటూ అలజడి సృష్టిస్తోంది.