Super Star Krishna: తెలుగు సినీపరిశ్రమలో ఎన్నో అధునాతన విషయాలు తెరమీదకు తెచ్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన చిత్రాలు కూడా వైవిధ్యంగా ఉండేందుకు ఇష్టపడతారు. మొట్టమొదటి స్కోప్ తెలుగు చిత్రం అల్లూరి సీతారామరాజు కావడం తెలిసిందే. అలాగే మొట్టమొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు. మొట్టమొదటి భారీ బడ్జెట్ చిత్రం సింహాసనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు ఆయన సొంతం. అందుకే ఆయనకు పరిశ్రమలో ఎంతో పేరుంది. ఎన్నో మైలురాళ్లు దాటిన ఆయన దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించి అందరిని అబ్బురపరచారు.
తెలుగులో మొట్టమొదటి భారీ బడ్జెట్ చిత్రం సింహాసనం. దీనికి దాదాపు రూ.3.50 కోట్లు ఖర్చు చేశారు. అప్పట్లో అది ఎక్కువే. ప్రస్తుతం బాహుబలి రికార్డే మనకు తెలుసు. అది సృష్టించిన హంగామా కూడా తెలుసు. భారతీయ సినిమాకే ఆదర్శంగా నిలిచిన బాహుబలి ఘనత అందరికి తెలిసిందే. అప్పట్ల్లో రూ.50 కోట్లు ఖర్చు చేస్తేనే భారీ బడ్జెట్ కానీ సింహాసనంకు అంత ఖర్చవుతుందని తెలుసుకుని నిర్మాతలెవరు ముందుకు రాలేదు. దీంతో తానే నిర్మాణం చేయాలని కృష్ణ భావించారు.
Also Read: నాడు ఆ కామెడీ షోలో ‘సిద్దూ’నే ప్రశ్నించిన భగవంత్ మాన్.. ఇప్పుడు ఏకంగా సీఎం!.. వైరల్
ఎవరైనా వేరే దర్శకుడిని పెట్టుకోవాలని భావించినా ఎవరూ సరిపోలేదు. దీంతో తానే దర్శకత్వం వహంచాలని అనుకున్నారు. సినిమా 1986లో విడుదలై సంచలనం సృష్టించింది. భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కలెక్షన్లు ఊపులో వచ్చాయి. బప్పీలహరి సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. దీనికి తోడు బాలీవుడ్ నటి మందాకిని నటనకు ప్రేక్షకులు ముగ్దులయ్యారు. వారి స్టెప్పులు కూడా రంజింపచేశాయి. దీంతో సినిమా ఘన విజయం సాధించింది.
అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ఘనత సాధించింది. హిందీలో సింహాసన్ పేరుతో నిర్మించారు. అక్కడ జితేంద్ర హీరోగా నటించారు. మొత్తానికి సింహాసనం బ్రహ్మాండమైన విజయం సాధించింది. భారీ బడ్జెట్ చిత్రాలకు నాంది పలికింది. అప్పటికి ఇంకా భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు.
హైదరాబాద్, బెంగుళూరుల్లో సినిమా నిర్మాణం చేశారు. కేవలం 53 రోజుల్లోనే చిత్ర నిర్మాణం పూర్తి కావడం విశేషం. మొదటి వారంలోనే రూ.1.51 కోట్లు సంపాదించి రికార్డులు కొల్లగొట్టింది. మొత్తంగా రూ.4.50 కోట్లు సాధించి రికార్డులు తిరగరాసింది. దీంతో సింహాసనం తెలుగు సినీ పరిశ్రమకు ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు. సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వంలో వచ్చి 40 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా ఖ్యాతి సాధించింది. భారీ బడ్జెట్ చిత్రాలకు కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన సింహాసనం చిత్రం ప్రేక్షకుల అంచనాలను దాటి విజయవంతం కావడం తెలిసిందే