China gold reserves: బంగారం, వెండి.. ప్రస్తుతం ఖరీదైన లోహాలుగా మారాయి. రెండేళ్లుగా వీటి ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో భవిష్యత్ ఈ రెండు లోహాలదే అని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పెట్టుబడి పెటేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో డ్రాగన్ కంట్రీ చైనాలో భారీగా బంగారం నిల్వలు బయటపడ్డాయి. ఈ కొత్త ఆవిష్కరణ ప్రపంచ ఖనిజ వనరుల మ్యాప్‌ను మార్చేలా ఉంది. అధిక గ్రేడ్ ఒర్తో కూడిన ఈ డిపాజిట్ గ్లోబల్ మార్కెట్‌పై చైనా పట్టుకు మరింత పెంచుతుంది.
హనాన్ ప్రావిన్స్‌లో నిల్వలు..
పింగ్జియాంగ్ కౌంటీలోని వాంగు గోల్డ్ ఫీల్డ్‌లో 40కి పైగా గోల్డ్ మైన్లు గుర్తించారు. 2 కిలోమీటర్ల లోతులో 300 టన్నులు బంగారం నిల్వలు గుర్తించారు. మొత్తం 1,000 టన్నులకు పైగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టన్నుకు 138 గ్రాముల గోల్డ్ కాన్సంట్రేషన్ – సాధారణ మైన్ల (10 గ్రా/టన్) కంటే 10 రెట్లు ఎక్కువ. కోర్ శాంపిల్స్‌లో కనిపించే గోల్డ్ ఈ డిపాజిట్ నాణ్యతను తెలియజేస్తోంది. 65 కి.మీ. డ్రిల్లింగ్‌తో 55 బోర్‌హోల్స్ పూర్తయ్యాయి. 2025 చివరిలో 55 టన్నులు అదనం చేసే లక్ష్యం.
సౌత్ ఆఫ్రికాను అధిగమించే స్థాయిలో..
సౌత్ డీప్ మైన్ (900 టన్నులు) కంటే పెద్దది, కానీ గ్రేడ్ ఎక్కువగా ఉంది. చిన్న మొత్తం ఒర్ నుంచి ఎక్కువ గోల్డ్ సేకరణ సాధ్యం. హనాన్ మినరల్ రిసోర్సెస్ గ్రూప్ నిర్వహిస్తోంది. నేచర్ జియోసైన్స్ పరిశోధన ప్రకారం, క్వారట్జ్ రాళ్లలో భూకంప ఒత్తిడితో పైజోఎలక్ట్రిక్ చార్జ్‌లు ఏర్పడి, హాట్ ఫ్లూయిడ్స్ నుంచి గోల్డ్ వేగంగా డిపాజిట్ అవుతుంది. చైనా మధ్య భాగం టెక్టానిక్ యాక్టివిటీతో పోలిచే ప్రదేశం.
చైనా గోల్డ్ డామినెన్..
ప్రపంచంలో 10% గోల్డ్ ప్రొడక్షన్ చైనా చేస్తోంది (2023లో 370 టన్నులు). ఈ డిపాజిట్‌తో రిజర్వులు, సప్లై చైన్‌లో ప్రభావం బలపడుతుంది. టెక్నాలజీలో (గోల్డెన్ లాయర్స్ లాంటివి) డిమాండ్ కూడా పెరుగుతోంది.