Maruti Baleno 2026: భారతీయ కార్ల మార్కెట్‌ను శాసిస్తున్న సంస్థలో మారుతి ఒకటి. ఇప్పటికే ఈ సంస్థ తయారు చేసిన స్విఫ్ట్, ఆల్టో, వ్యాగన్ ఆర్‌తోపాటు ఆరు మోడళ్లు టాప్‌టెన్‌లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు కస్టమర్ల అభిరుచి మేరకు కొత్త వేరియట్లను విడుదల చేస్తున్న మారుతి 2026లో మరో సరికొత్త మైలేజీ కారును మార్కెట్‌లో విడుదల చేయబోతోంది. కార్ లవర్స్ అంతా ప్రస్తుతం మైలేజ్ చూస్తున్నారు. ఎలక్ట్రానిక్ కార్ల తయారీ పెరుగుతున్నా.. మారుతి.. ఆ పోటీని తట్టుకునేందుకు మైలేజ్ కార్ల తయారీపై దృష్టి పెట్టింది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను తయారు చేస్తోంది.
బలెనో న్యూ మోడల్..
బలెనో కొత మోడల్‌ను 2026లో విడుదల చేయాలని మారుతి నిర్ణయించింది. ఈ మోడల్‌లో అధునాతన 1.2 లీటర్ పెట్రోల్ యూనిట్ ఫిట్ అయింది. సులభమైన డ్రైవింగ్, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ అందించి, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచారు.
బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్..
సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ రికార్డ్. పెరిగిన పెట్రోల్ ధరల మధ్య రన్నింగ్ కాస్ట్‌లను తగ్గించి, దీర్ఘకాలిక ఆదా అందిస్తుంది. ఈ అంశం కారు ధరతో కలిసి వాల్యూ ఫర్ మనీ స్థితిని బలపరుస్తుంది. లీటర్‌కు 22.3 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
లగ్జరీ ఇంటీరియర్స్..
క్యాబిన్‌లో స్పేషస్, ప్రీమియం సీటింగ్, లెగ్ రూమ్ పుష్కలంగా ఉన్నాయి. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్–ఈబీడీ, ఐఎస్‌ఓఎఫ్‌ఐఎక్స్ మౌంట్స్ సేఫ్టీని హైలైట్ చేస్తాయి. మోడరన్ డిజైన్ కుటుంబ ట్రిప్‌లకు అనుకూలం. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కమాండ్స్, స్మార్ట్‌ఫోన్ లింకింగ్ లాంటివి యువ డ్రైవర్లను ఆకర్షిస్తాయి. కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో డ్రైవ్ ఎక్స్‌పీరియన్స్ ఆకట్టుకుంటుంది. ఈ అప్‌గ్రేడ్‌లు సెగ్మెంట్‌లో బాలెనోను ముందుంచాయి.
మధ్య తరగతికి అదుబాటు ధర..
ఎంట్రీ లెవెల్ వేరియంట్ బడ్జెట్‌లో అందుబాటులో ఉంది. మొదటి కారు కొనుగోలుదారులు, సెకండ్ వెహికల్ కోసం కుటుంబాలకు ఇది బెస్ట్ ఛాయిస్. ఫీచర్లతో ధర సమతుల్యత మారుతి బలాన్ని చూపిస్తుంది. ఈ మోడల్ మారుతి హాచ్‌బ్యాక్ డామినెన్స్‌ను మరింత పెంచుతుంది. స్టైలిష్ ఎక్స్‌టీరియర్, బోల్డ్ గ్రిల్‌తో రోడ్‌పై హెడ్‌టర్నర్. 2026లో సేల్స్ చార్ట్‌లలో టాప్ స్థానం ఖాయం.