China Floods: డ్రాగన్ కంట్రీ చైనాలో ఎప్పుడు ఎలాంటి ముప్పు ఉంటుందో తెలియడం లేదు. వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. తర్వాత అనేక వ్యాధులకు కారణమైన వైరస్‌లు కూడా చైనాలోనే మొదలయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇక చైనాలో ప్రకృతి విపత్తులు సర్వ సాధారణం. వర్షాలు, వరదలు, కరువు, మంచు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు ఇలా అనేకం సంభవిస్తుంటాయి. తాజాగా చైనాలోని గ్వాంగ్జీ ప్రాంతంలో తీవ్ర వరదలు సాధారణ విపత్తును మించి మరో ప్రమాదాన్ని తీసుకువచ్చాయి. సర్పాల పెంపక కేంద్రాలు నీటిలో మునిగిపోయాయి. దీంతో వందలాది పాములు వెలుపలకు వచ్చాయి. ఇందులో విషపూరిత జాతులు కూడా ఉండటం ప్రజల్లో ఆందోళనను పెంచింది. ఈ సంఘటన విపత్తుల సమయంలో జంతు పెంపక వ్యవస్థలు ఎలా అదనపు ముప్పుగా మారతాయో చూపిస్తుంది.
వరద విపత్తు..
తీవ్ర వర్షాలు, నదులు పొంగడం వల్ల పలు ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. రోడ్లు, గ్రామాలు మునిగిపోవడంతో సాధారణ జీవితం స్తంభించింది. ఈ పరిస్థితి స్థానికంగా ఉన్న సర్ప పెంపక కేంద్రాలను ప్రభావితం చేసింది. వరద నీరు కేంద్రాల రక్షణ గోడలను బద్దలు కొట్టడంతో పాములు ఈదుకుంటూ బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు ఈ పరిస్థితిని మరింత హైలైట్ చేశాయి.
సర్ప పెంపక కేంద్రాల నుంచి అపాయం..
గ్వాంగ్జీ ప్రాంతం సర్పాల పెంపకానికి ప్రధాన కేంద్రం. సంప్రదాయ వైద్యం, తోలు, ఆహారం కోసం ఇక్కడ లక్షలాది సర్పాలను పెంచుతారు. వరదలు ఈ కేంద్రాలను దెబ్బతీయడంతో విషపూరిత జాతులు సహా పాములు నివాస ప్రాంతాల్లోకి చేరాయి. ఈ పరిస్థితి ప్రజల రోజువారీ కదలికలను ప్రభావితం చేసింది. పాములు నీటిలో ఈదుతున్న దృశ్యాలు భయాన్ని పెంచాయి.
సర్ప పెంపక కేంద్రాల నుంచి బయటకు వచ్చిన పాముల్లో చాలా వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా పాములను పట్టుకున్నారు. ఇంకా 900 పాముల ఆచూకీ తెలియడం లేదు. దీంతో ఇవి ఇళ్లలోకి చేరితో మనుషులకు ప్రమాదమని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Hengzhou, #China July 6 /2026
After days of heavy rain ️ and flooding across China, around 900 snakes escaped from a breeding farm in Hengzhou. Reports say the reptiles included venomous cobras, with villagers attempting to catch them in the floodwaters. pic.twitter.com/cTcgAZ4nZd— CAUGHTIN4KHQ (@CaughtIn4KHQ) July 9, 2026
