China: ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనానే (China). ఇది ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో చైనా దాదాపు 15 శాతం ఉంది. అయితే చైనా కొన్ని సందర్భాల్లో లాటిన్ అమెరికా (America) దేశాలపై ఆధారపడుతోంది. సోయాబీన్స్ (Soya Beans), ఇతర కూరగాయలు, జంతు ఉత్పత్తులు, రాగి, పెట్రోలియం, చమురు, ఇతర ముడి పదార్థాలను చైనా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటాయి. అయితే వీటితో పాటు ఎద్దుల వీర్యాన్ని కూడా చైనా దిగుమతి చేసుకుంటోంది. అధిక నాణ్యత గల ఎద్దుల నుంచి వీర్యా్న్ని సేకరిస్తోంది. వీటితో పాల ఉత్పత్తితో పాటు పాల నాణ్యతను మెరుగుపరచడానికి చైనా ప్రయత్నిస్తోంది. అసలు ఎద్దుల వీర్యాన్ని చైనా కొనుగోలు చేయడానికి కారణం ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
పెరుగుతున్న పాల ఉత్పత్తి
చైనాలో పాలకు డిమాండ్ పెరుగుతోంది. దీనివల్ల ఎద్దుల వీర్యం కొనుగోలు చేస్తుంది. ఈ వీర్యంతో పాల ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తోంది. దీని ద్వారా పాల ఉత్పత్తి ఆటోమెటిక్‌గా పెరుగుతోంది. ప్రస్తుతం చైనా జనాభా కూడా రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో వారు పాల ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.
మాంసం ఉత్పత్తిని పెంచడం
చైనా కొన్ని జాతుల ఎద్దులను మాంసానికి కూడా ఉపయోగిస్తోంది. వీటి వినియోగం అక్కడ పెరగడంతో మాంసం ఉత్పత్తిని పెంచాలని ఎద్దుల వీర్యాన్ని కొనుగోలు చేస్తోంది. సాధారణంగా చైనా మాంసాహారాన్ని ఎక్కువగా తింటుంది. ఈ కారణంతోనే వాటి ఉత్పత్తిని పెంచాలని చైనా ఎద్దు వీర్యాన్ని కొనుగోలు చేస్తోంది.
జన్యు నాణ్యతను పెంచడం కోసం
మంచి ఎద్దుల నుంచి వీర్యాన్ని కొనుగోలు చేసి వాటి ద్వారా జన్యు నాణ్యతను మెరుగుపరచవచ్చని చైనా భావిస్తోంది. వీటి ద్వారా పాల ఉత్పత్తి, మాంసం నాణ్యత కూడా పెరుగుతోందని భావిస్తోంది. ఇలా చేయడం వల్ల ఎద్దులు కూడా నాణ్యతతో ఉంటాయి. ఇంకా వీటి సంఖ్య కూడా పెరుగుతోంది.
వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం
కొన్ని జాతుల ఎద్దులను పొలాలను దున్నడానికి ఉపయోగిస్తారు. చైనా మంచి నాణ్యమైన ఎద్దుల నుంచి వీర్యాన్ని తీసుకుని వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది. వీటి వల్ల వ్యవసాయం కూడా తొందరగా అవుతుంది.
ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం
చైనా ఆర్థిక వ్యవస్థలో పశు పోషణ కూడా ముఖ్యమైన భాగం. బాగా పెరిగిన ఎద్దుల వీర్యం ఉపయోగించి పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేయవచ్చు. దీంతో రైతుల ఆదాయాన్ని కూడా పెంచవచ్చు.
కృత్రిమ గర్భధారణ
ఎద్దుల వీర్యంతో కృత్రిమ గర్భధారణకు ఉపయోగిస్తారు. దీనివల్ల ఒక ఎద్దు నుంచి బహుళ ఆడపిల్లలను కలిపి, సంతానోత్పత్తి ప్రక్రియ వేగంగా చేస్తారు. ఈ కృత్రిమ గర్భధారణ వల్ల వ్యాధులు వ్యాప్తి తక్కువగా ఉంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.