https://oktelugu.com/

Bharath-China: చైనా భారత్ వైపునకు వస్తుందా..? పాకిస్తాన్ పరిస్థితి ఏంటి..?

శత్రువులైన బలమైన దేశాలు చైనా-భారత్. ఇప్పుడు బలమైన దోస్తీగా మారబోతున్నాయి. దీంతో అగ్రరాజ్యమైన అమెరికా నుంచి అడుక్కుతినే పాకిస్థాన్ వరకు ఆందోళనలో ఉన్నాయి. ఎందుకంటే ఈ రెండు..

Written By:
  • Mahi
  • , Updated On : November 7, 2024 / 02:28 PM IST

    Bharath-China

    Follow us on

    Bharath-China: ప్రపంచంలోనివివిధ దేశాలు వాటి వాటి అవసరాలను బట్టి ఇతర దేశాలతో స్నేహం చేస్తాయి.. శతృత్వం కూడా పెట్టుకోవడం కామన్. ఈ రెండు విషయాల్లో భారతదేశం గురించి మాట్లాడుకుంటే భారత్ ఎప్పుడూ ఏ దేశంతో శతృత్వం పెట్టుుకోదు. కారణం మొదటి నుంచి శాంతి కాముక దేశం కాబట్టి. అందుకే మొఘలులు, ఆంగ్లేయులు ఈ దేశాన్ని వశం చేసుకొని కోట్లాది రూపాయలు సంపద రూపంలో.. అంత కంటే ఎక్కువ విలువైనదాన్ని జ్ఞాన రూపంలో దోచుకున్నారు. అయినా అందరినీ ప్రేమించే దేశం భారత్. అంతర్జాతీయ వేధికపై కూడా భారత్ శాంతినే బోధిస్తుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విధానం మారింది. శాంతిని బోధిస్తూనే దేశం జోలికి ఎవ్వరు వచ్చినా ఊరుకోవడం లేదు. ‘మేము శాంతి కాముకులం మమ్ములను కవ్విస్తే మాత్రం ఊరుకోం’ అని చెప్తోంది. ప్రపంచంలోని చాలా దేశాలు భారత్ తో ఫ్రెండ్లీ విధానాన్ని అవలంభించేందుకు నేడు ఉవ్విళ్లూరుతున్నాయి. శత్రుదేశాలు కూడా మిత్రత్వం కోసం చేయి చాస్తున్నాయి. భారత్ కు పొరుగున ఉన్న శత్రుదేశాల్లో పాకిస్తాన్ ఒకటైతే మరోటి చైనా. పాకిస్తాన్ గురించి భారత్ ఎప్పుడూ పట్టించుకోదు. ఎందుకంటే భారత్ వైపు కన్నెత్తి చూసేందుకు సైతం పాక్ కు దమ్ము లేదు. ఇక మరోటి చైనా. ఇప్పటి వరకు సరిహద్దుతో ఢీ అంటే ఢీ అన్నట్లు ఉన్న చైనా భారత్ లు ఇప్పుడు స్నేహితులుగా మారబోతున్నారంటే సందేహించాల్సిందే కదా.. కానీ ఇది నిజం. అయితే ఇందులో బార్డర్ సమస్యలు, ఇంకా తదితర సమస్యలపై పోరు అలాగే ఉంటుంది కానీ వాణిజ్యం, వ్యాపారం, టూరిజం ఇలా చాలా అంశాల్లో రెండు దేశాలు స్నేహంగా ఉండబోతున్నాయి.

    ట్రంప్ గెలుపుతో మారుతున్న సీన్..
    ప్రపంచపు పెద్దన్నగా చెప్పుకుంటున్న అమెరికాలో ఎన్నికలు ముగిశాయి. భారత వ్యతిరేఖ విధానాలు అవలంభించే ట్రంప్ వైట్ హౌజ్ ను వశం చేసుకున్నాడు. అమెరికా నుంచి ఎప్పుడూ భారత్ కు మద్దతు లేదు. కానీ భారత్ ను అవసరాల కోసం అమెరికా వాడుకుంటుంది. ఇది భారత్ కు తెలుసు. ఎందుకంటే రష్యాకు అమెరికాకు శత్రుత్వం ఉంది. అలాగే చైనాకు అమెరికాకు కూడా శతృత్వం ఉంది.

    భారత్ కు మాత్రం రష్యా అత్యంత మిత్ర దేశం, అదే విధంగా చైనా శత్రుదేశం చైనాను, అమెరికాను దెబ్బ కొట్టాలంటే భారత్ చేతిలో ఉండాలని అమెరికా భావిస్తుంది. కానీ ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా పావులు కదుపుతుంది. రష్యా ఎప్పుడూ భారత్ కు మిత్రదేశమే కాబట్టి ఎటూ వెళ్లదు. ఇక చైనాను వశపరుచుకుంటే అమెరికా చేతిలో భారత్ కాకుండా.. భారత్ చేతిలో అమెరికా కీలుబొమ్మగా మార్చుకోవచ్చు.

    భారత్ వైపునకు చూస్తున్న చైనా..
    ఇన్నాళ్లు భారత్ తో శత్రుత్వం పెట్టుకున్న చైనాకు ఏదీ సాధించలేదని తెలిసిపోయింది. సరిహద్దులోని అంగుళం కూడా విడిచిపెట్టుకునేందుకు భారత్ ససేమీరా అంటుంది. కాబట్టి ఇప్పుడు దాని కోసం వివాదం అవసరం లేదని చైనా భావిస్తోంది. అందుకే ఇరు దేశాలు బార్డర్ నుంచి కొంత దూరం వెళ్లాయి. ఇక ఆర్థికంగా ఎదిగేందుకు భారత్ దోస్తీ కలిసి వస్తుందని చైనా అనుకుంటుంది. అందుకే భారత్ వైపునకు చూస్తోంది.

    బిక్కు బిక్కుమంటున్న పాకిస్తాన్
    ఉమ్మడి శత్రువు బూచీ చూపి పాక్ చైనాను బుట్టలో వేసుకుంది. దీంతో ఏళ్లుగా చైనా పాకిస్తాన్ ను ఆర్థికంగా ఆదుకుంటూ వస్తోంది. ఆ దేశంలో ఎన్నో ప్రాజెక్టులను నిర్మిస్తోంది. కానీ ఒక్క రూపాయి కూడా రావడం లేదు. కనీసం ప్రాజెక్టులకు పెట్టిన ఖర్చు కూడా రావడం లేదు. దీంతో చైనా పాకిస్థాన్ విషయంలో గుర్రుగా ఉంది. పైగా అక్కడి ఉగ్రవాదుల దాడిలో చైనా ఇంజినీర్లు మరణిస్తున్నారు. ఇది కూడా వారికి కొంచెం ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. అందుకే ఇప్పుడు భారత్ తో దోస్తీ చేయాలని చూస్తోంది. దీంతో ఉన్న ఒక్క దేశం కూడా చేజారుతుందని పాక్ ఆందోళనలో ఉంది.