Cheapest gold price in world: బంగారం ధరలు ప్రస్తుతం కొండెక్కిపోతున్నాయి. 10 గ్రాముల బంగారానికి దాదాపు 1,50,000 కు పై గానే ఉంటుంది. ఇలాంటి సమయంలో భారతీయులు బంగారం కొనుగోలు పై అనాసక్తి చూపుతున్నారు. అయినా కూడా అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే మిగతా దేశాల్లో కంటే భిన్నంగా ఓ దేశంలో బంగారం ధర మరీ తక్కువగా విక్రయిస్తున్నారు. ఇక్కడ 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.181 గానే ఉంది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.166 తో విక్రయిస్తున్నారు. అసలు ఈ దేశంలో బంగారం ధర ఇంత తక్కువగా ఉండడానికి కారణం ఏంటి? ఇక్కడ బంగారం కొనుగోలు చేసి ఇండియాకు తీసుకెళ్లవచ్చా?
ప్రతి దేశంలో కరెన్సీ విలువ ఎక్కువగా ఉంటేనే ఆ దేశంలో వస్తు విలువ ఎక్కువగా ఉంటుంది. అయితే వెనిజులా దేశంలోని కరెన్సీ బోలివర్ విలువ దారుణంగా పడిపోయింది. ఈ దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఈ కరెన్సీ విలువ సున్నా కి పడిపోయింది. అంతేకాకుండా దేశ ఆదాయంలో ఎక్కువ భాగం చమురు నుంచే వస్తుంది. చమరుధర్వలు ప్రస్తుతం పడిపోయి దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోంది. అంతేకాకుండా నిధుల కొరతను అధిగమించడానికి ప్రభుత్వం విచ్చలవిడిగా నోటను ముద్రించడం.. అమెరికా ఆంక్షలు వల్ల తమరి ఎగుమతులు తగ్గి.. డాలర్ల లభ్యత తగ్గిపోవడం వంటివి ఈ దేశంలో ద్రవ్యోల్బణం ఏర్పడానికి కారణాలుగా చెప్పవచ్చు.
ఈ క్రమంలో ఇక్కడ కొన్ని వస్తువుల కొనుగోలు చేసేందుకు చేతిలో ఉన్న బంగారాన్ని కూడా మార్పిడి చేసుకుంటున్నారు. ఫలితంగా బంగారం నిలువలు ఎక్కువగా మారి వాటి విలువ కూడా పడిపోయింది. ప్రస్తుతం ఇక్కడ 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర కేవలం రూ.181 తో విక్రయిస్తున్నారు. అంతేకాకుండా వెనిజులా ప్రతినెల 650 నుండి 1000 కిలోల బంగారాన్ని అమెరికాకు ఎగుమతి చేసే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో దేశంలో అప్పులు తీర్చడానికి పెద్ద మొత్తంలో బంగారం ఇతర దేశాలకు తరలిస్తున్నారు.
అయితే ఈ బంగారాన్ని ఇండియాకు కొనుగోలు చేసుకుని తీసుకొని రావచ్చా అని కొందరికి సందేహం ఉంటుంది. వాస్తవానికి ఒక ఏడాది దాటిన తర్వాత విదేశాల్లో ఉండే మహిళ 40 గ్రాముల బంగారాన్ని మాత్రమే ధరించి తీసుకొని రావచ్చు. పురుషుడికి 20 గ్రాముల బంగారం ధరించి తీసుకొని రావచ్చు. కానీ వీటిపై కస్టమ్స్ సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇవి అధికంగానే ఉండొచ్చు. దీంతో అక్కడి నుంచి బంగారం తీసుకువచ్చినా కూడా చాలా తక్కువగా ఉపయోగం ఉంటుందని కొందరు చెబుతున్నారు.