https://oktelugu.com/

America : అదృష్టం అంటే అతనిదే బై..రూ. 415 పెట్టి కొంటే రూ. 3.33 లక్షలకు అమ్ముడుపోయింది. ఇంతకీ ఏంటంటే?

మన చేతిలో ఉన్న ఒక చిన్న వస్తువు లక్షలు ఖరీదు చేస్తుందంటే ఎంత ఆనంద పడతారు కదా. తెలిసీ తెలియక మన దగ్గరకు వచ్చినా, మనం కావాలని దాన్ని తీసుకున్నా సరే దాని ఖరీదు లక్షల్లో ఉంటే అబ్బ ఆ సంతోషం వేరుగా ఉంటుంది కదా. ఇప్పుడు అలాంటి వార్తనే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 6, 2025 / 05:00 AM IST
    John Carcerano bought an old plate

    John Carcerano bought an old plate

    Follow us on

    America :  అరె నువ్వు లక్కీ పర్సన్ రా అని చాలామంది అంటారు కదా. కానీ అందరికీ ఆ అదృష్టం ఉండదు. అదృష్టం కలిసి రావాలంటే పెట్టి పుట్టాలి. ఇక లక్షలు, కోట్లు సంపాదించాలంటే దానికి నక్కతోక తొక్క పుట్టాలి అంటారు పేదలు. మరి అంతే కదండీ ఉన్నట్టుండి లక్షాధికారుల, కోటీశ్వరులు కావడం అంటే మాటలా చెప్పండి. ఇదంతా పక్కన పెడితే మన చేతిలో ఉన్న ఒక చిన్న వస్తువు లక్షలు ఖరీదు చేస్తుందంటే ఎంత ఆనంద పడతారు కదా. తెలిసీ తెలియక మన దగ్గరకు వచ్చినా, మనం కావాలని దాన్ని తీసుకున్నా సరే దాని ఖరీదు లక్షల్లో ఉంటే అబ్బ ఆ సంతోషం వేరుగా ఉంటుంది కదా. ఇప్పుడు అలాంటి వార్తనే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

    అమెరికాకు చెందిన ఈ యువకుడిదీ సేమ్ ఇలాంటి కథనే. ఇల్లినాయిస్‌కు చెందిన కార్పెట్ క్లీనర్ జాన్ కార్సెరానో ఒక పాత దుకాణంలో కేవలం రూ. 415 కి ఒక ప్లేట్ ను కొన్నాడు. ఈయనకు సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనడం చాలా ఇంట్రెస్ట్. సెకండ్ హ్యాండ్ అంటే చాలా పురాతనమైనవి, ప్రత్యేకమైనవి మాత్రమే కొనుగోలు చేస్తుంటాడట. వాటిని సేకరిస్తుంటాడట. అయితే ఆయన రూ. 415 పెట్టి కొన్న ఆ ప్లేట్ ప్రస్తుత ధర మూడు నుంచి ఐదు లక్షల మధ్య ఉంటుందని తెలిసి ఆశ్చర్యపోయాడు..

    జాన్ ఈ ప్లేట్ ను ఒక వస్తువుల స్టోర్‌లోని వివిధ వస్తువుల మధ్య చూశాడు. అది వెంటనే నచ్చడంతో కొనేశాడట. జాన్ ఆ ప్లేట్ ను చూడగానే, అది చాలా ప్రత్యేకమైనదని తెలుసుకున్నాడు. అది సాధారణమైనది కాదని జాన్ భావించి దాని గురించి ఆరాలు తీస్తే దిమ్మతిరిగే వార్త తెలిసిందే. ఇలాంటి ప్లేట్ కొన్ని సంవత్సరాల నుంచి లభించలేదని. వేలంలో ఇప్పటికీ ఇలాంటివి కేవలం ఒక మూడు మాత్రమే లభించాయి అని తెలిసింది. అయితే ఇలాంటిదే రీసెంట్ గా 3.66 లక్షలు అమ్ముడైందని తెలుసుకున్నాడు.

    దీన్ని నిర్ధారించుకోవడానికి వేలం సంస్థల వద్దకు వెళ్తే వారు కూడా ఇది చాలా రేర్ వస్తువు అని 1775 నాటిది అని తెలిపారు. అప్పటి క్వింగ్ రాజవంశం కియాన్ లాంగ్ కాలం నాటి చైనీస్ ఎక్స్ పోర్ట్ ఆర్మోరియల్ చంఫేర్డ్ రెక్టాంగ్యులర్ ప్లాటర్ అని తేల్చారట. జాన్ చాలా సంవత్సరాలుగా ఇలాంటి పాత వస్తువులను కొని అమ్ముతుంటాడు. ఆ అలవాటు ఆయనకు ఈ ప్లేట్ ద్వారా ఏకంగా రూ 3.33 లక్షల నుంచి 5 లక్షల వరకు సంపాదించేలా చేసింది. ఇది కదా లక్కీ అంటే..