Canada Vs India: కెనడా -భారత్ మధ్య వివాదం ఈనాటిది కాదు. గత దశాబ్దాలుగా భారత్ పై కెనడా ఏదో ఒక రూపంలో తన విద్వేషాన్ని వెళ్ళగకుతూనే ఉంది. దానికి ఇప్పుడు జస్టిన్ ట్రూడో తోడు కావడంతో అది తారాస్థాయికి చేరింది.. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారత్ పై చేసిన వ్యాఖ్యలు తాజాగా మరో వివాదానికి కారణమయ్యాయి. ఖలిస్థాని మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ ఇటీవల హత్యకు గురయ్యాడు. అతడి హత్యకు సంబంధించిన దర్యాప్తులో భారత హై కమిషనర్ జోక్యం చేస్తుందని కెనడా ప్రభుత్వం ఆరోపించింది. ఆ తర్వాత వివాదం చెలరేగింది. మన దేశానికి చెందిన దౌత్య వేత్తలను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేయడంతో భారత విదేశాంగ శాఖ స్పందించింది. కెనడా ప్రభుత్వానికి కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది.. ట్రూడో తన రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ పై విషం చిమ్ముతున్నారని ఆరోపించింది.. అయితే భారత్ – కెనడా దేశాల మధ్య సంబంధాల విషయంలో చోటు చేసుకున్న ఉద్రిక్తత ఇవాల్టిది కాదు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 2023 నుంచి పరిస్థితి మరింత చేయి దాటిపోయింది.
కొలంబియాలో హత్య
జూన్ 2022లో కొలంబియాలోని సర్రే ప్రాంతంలో హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. అతడిని భారతీయ ఏజెంట్లు హత్య చేశారని కెనడా అధ్యక్షుడు ట్రూడో ఆరోపించారు. ఎన్నికలకు ముందు కూడా అతడు ఇలాంటి ఆరోపణలు చేశాడు. అయితే జస్టిన్ ట్రూడో తండ్రి పియరీ ఇలియట్ ట్రూడో కూడా భారత్ పై విద్వేషాన్ని ప్రదర్శించేవాడు. ఆయన హయాంలో కూడా భారత్ – కెనడా మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. దీంతో ఆయన కూడా విమర్శలను చవిచూడాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం జస్టిన్ ట్రూడో కూడా తండ్రి బాటలో నడుస్తున్నట్టు తెలుస్తోంది.
1974లో భారత్ అణు పరీక్షలు చేసినప్పుడు కెనడాతో వివాదాలు మొదలయ్యాయి. నాటి కెనడా ప్రధానమంత్రి ఫియరి ట్రూడో మన ప్రభుత్వం చేపట్టిన అణు పరీక్షలపై అసంతృప్తి ప్రయత్నం చేశారు. 1998లో రరాష్ట్రం రాష్ట్రం లోని పోక్రాన్ ప్రాంతంలో భారత్ అణు పరీక్షలు నిర్వహించింది. వాటిని కూడా పియరి తప్పుపట్టాడు.
ఇక 1980 లో ఖలిస్థానీ ఉగ్రవాదులను భారత ప్రభుత్వం తరిమి తరిమికొట్టింది. అప్పుడు వారు తమకు గమ్యస్థానంగా కెనడా దేశాన్ని మార్చుకున్నారు. నాటి పీయరీ ప్రభుత్వం ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడాలో ఆశ్రయం ఇచ్చింది.. 1981లో పంజాబ్ రాష్ట్రంలో ఇద్దరు పోలీసులను చంపిన ఖలిస్థానీ గ్రూప్ సభ్యుడు తల్వీందర్ సింగ్ కెనడా పారిపోయాడు. అతని అప్పగించాలని భారత్ కోరితే…పియర్ ఒప్పుకోలేదు. ఇక 1985 జూన్ 23న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు పేలుడు జరగడం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. ఆ ఘటనలో 329 మంది చనిపోయారు. అయితే దీనికి తల్విందర్ సింగ్ సూత్రధారి అని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ ఘటనపై అతడిని విచారించడానికి పియరి ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఈ వ్యవహారంపై నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కూడా పియరి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కెనడా ప్రభుత్వం వైఖరి మార్చుకోలేదు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Canada has been venomous and hateful to india for decades
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com