Rishi Sunak : బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ ముందస్తు సార్వత్రిక ఎన్నికలను పిలుపునిచ్చారు. జూలై 4న అందరూ ఓటేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అతని పాలక పార్టీ కన్జర్వేటివ్ 14 సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత ప్రతిపక్ష లేబర్ పార్టీ చేతిలో ఓడిపోతారని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఎప్పుడు ఎన్నికలకు పిలుపునిస్తాడోనని నెలల ఊహాగానాలకు బుధవారం (మే 22) రోజున ముగింపు పలికారు. డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం వెలుపల నిలబడి.. కొందరు ఊహించిన దాని కంటే ముందుగానే ఎన్నికలకు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు.
‘బ్రిటన్ తన భవిష్యత్ ను ఎంచుకునేందుకు సమయం ఆసన్నమైంది’ అని అతను చెప్పాడు. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ కంటే సునక్ పార్టీ వెనుకబడి ఉండడమే కాకుండా తన పార్టీలో కొందరి నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. సునక్ రెండేళ్ల కిందటే బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి అతను దేని కోసం ప్రధాని అయ్యానోనని చెప్పడంలో చాలా కష్టపడ్డాడు. అతని విజయాలను ప్రచారం చేసుకోవడంలో విఫలం అయ్యాడు.
‘మార్పు’ కోసం..
బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మర్ మాట్లాడుతూ.. కన్జర్వేటివ్ ప్రభుత్వం ఇన్నాళ్లు చేసిన ‘గందరగోళాన్ని’ అంతం చేసేందుకు ఈ ఎన్నికలు అవకాశం కల్పిస్తాయని అన్నారు. ‘సునక్ ఏం చెప్పినా, చేసినా, మార్పునకు అవకాశం ఈ ఎన్నికలు’ అని స్టార్మర్ మద్దతుదారులతో అన్నారు.
‘లేబర్‌కి ఓటు అనేది స్థిరత్వానికి నిదర్శనం ఆర్థికంగా దేశం ఎదిగేందుకు లేబర్ పార్టీకి ఓటు వేటు వేయండి’ అని ఆయన కోరారు. బ్రిటీష్ ఎన్నికలు కనీసం ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరగాలి. అయితే ఒక్కో సారి ప్రధాన మంత్రి నిర్ణయం మేరకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఒపీనియన్ పోల్స్‌లో సునాక్ పార్టీ కన్జర్వేటివ్, లేబర్ పార్టీ కంటే వెనుకబడి ఉంది. ద్రవ్యోల్బణం తగ్గుదల, రక్షణ వ్యయాల పెరుగుదలను ప్రశంసించినప్పటికీ, వారు ప్రతిపక్ష పార్టీ ఆధిక్యంలో డెంట్ చేయడంలో విఫలమయ్యారు.
2019లో జరిగిన ఎన్నికల తర్వాత సునక్ మూడో కన్జర్వేటివ్ ప్రధానమంత్రి అయ్యారు. అతను ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచగలిగాడు.. కానీ ప్రజల్లో కన్జర్వేటివ్‌లపై ఆదరణను పెంచడంలో మాత్రం విఫలం అయ్యాడు. UKలో ద్రవ్యోల్బణం 2.3 శాతానికి పడిపోయిందని బుధవారం విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయి. ఇది చాలా పెద్ద క్షీణ గత మూడేళ్లలో కనిష్ట స్థాయి. కానీ లేబర్ 2021 చివరి నుంచి ఒపీనియన్ పోల్స్‌లో కన్జర్వేటివ్‌ల కంటే 20 పాయింట్ల ఆధిక్యంలో ఉంది.