https://oktelugu.com/

Britain King Charles: బ్రిటన్‌ కింగ్‌కు భారత్‌లో ట్రీట్‌మెంట.. రహస్యంగా ఇండియాలో పర్యటించిన దంపతులు!

బ్రిటన్‌.. భారత్‌ను 200 ఏళ్లు పరిపాలించిన దేశం. మన సంపదను కొల్లగొట్టిన సామ్రాజ్యవాద రాజ్యం. ప్రపంచంలో ఎంతో అభివృద్ధి చెందిన దేశం. కానీ, రాజు వైద్యం కోసం మళ్లీ భారత్‌కు వచ్చారు. అదీ రహస్యంగా..

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 30, 2024 3:50 pm
    Britain King Charles

    Britain King Charles

    Follow us on

    Britain King Charles: బ్రిటిష్‌ పాలనలో భారతీయులు సుమారు 200 ఏళ్లు కట్టు బానిసల్లా బతికారు. మనల్ని పాలిస్తూ.. మన సంపదను తరలించుకుపోయారు. వ్యాపారాన్ని విస్తరించారు. 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం ఇచ్చారు. మనకన్నా ఎంతో అభింద్ధి చెందిన దేశం బ్రిటన్‌. ఆదేశ అభివృద్ధిలో భారతీయుల శ్రమ, కష్టం ఉన్నాయి. ఇంత అభివృద్ధి చెందిన దేశం.. నేటికీ కొన్ని విషయాల్లో భారత్‌పై ఆధారపడుతోంది. తాజాగా బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌–3 ఆయన భార్య క్వీన్‌ కెమిల్లా.. భారత్‌లో రహస్యంగా పర్యటించారు. అక్టోబర్‌ 27 నుంచి దంపతులు బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. అక్కడి ఓ వెల్నెస్‌ కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఈ సెంటర్‌లో యోగా, మెడిటేషన్‌ సాధనలో సమయం గడుపుతున్నట్లు తెలుస్తోంది. వీరు బుధవారం(అక్టోబర్‌ 30న) బ్రిటన్‌ బయల్దేరి వెళ్తారని సమాచారం.

    కామన్‌వెల్త్‌ సమావేశం నుంచి..
    మీడియా కథనాల ప్రకారం.. కింగ్‌ చార్లెస్‌–3 దంపతులు అక్టోబర్‌ 21 నుంచి 26 వరకు కామన్‌వెల్త్‌ ప్రభుత్వానినేతల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కింగ్‌ దపంతులు సమోవా నుంచి నేరుగా భారత్‌కు వచ్చారు. ఈ పర్యటనను భారత్‌ కూడా రహస్యంగా ఉంచింది. వ్యక్తిగత పర్యటన కావడంతో భారత్‌ కూడా ఎలాంటి అధికారిక ఏర్పాట్లు చేయలేదు. చికిత్స కోసం వారు బెంగళూరులోని వెల్‌నెస్‌ సెంటర్‌కు వచ్చిటనుల సమాచారం. అక్కడ వారు వివిధ థెరపీలు చేయించుకున్నారట.

    తొలిసారి భారత్‌కు..
    బ్రిటన్‌ రాజుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కింగ్‌ చార్లెస్‌–3 భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. ఆయన వేల్స్‌ యువరాజుగా ఉన్న సమయంలో పలుమార్లు బెంగళూరులోని వెల్‌నెస్‌ సెంటర్‌కు వచ్చేవారు. తన 71వ పుట్టిన రోజు కూడా ఇక్కడే జరుపుకున్నారు. 2022లో క్వీన్‌ ఎలిజిబెత్‌ మరణం తర్వాత చార్లెస్‌ రాజుగా బాధ్యతలు చేపట్టారు. ఇక రాజు దంపతులు చికిత్స పొందుతున్న ఆస్పత్రి సమేథనహళ్లి ఉంది. దీనిని డాక్టర్‌ ఇస్సాక్‌ మథాయ్, డాక్టర్‌ సుజా ఇస్సాక్‌ ఏర్పాటు చేశారు. ఇందులో ఆయుర్వేదం, నేచురోపతి, ఆక్యుప్రెషర్, యోగా, హోమియోపతి, ఇతర సంప్రదాయ చికిత్సలు చేస్తారు. కింగ్‌ చార్లెస్‌–3 ఇక్కడికి ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు వచ్చారని సమాచారం.