NTR: నందమూరి ఫ్యామిలీ లో కోల్డ్ వార్ నడుస్తోంది. రాజకీయంగా, సినిమాల పరంగా రెండు వర్గాలుగా విడిపోయారు. హరికృష్ణ టీడీపీకి దూరమయ్యాక… ఎన్టీఆర్ ఇతర కుమారులు, కుటుంబ సభ్యులు ఒకవైపు, ఆయన మరొకవైపు అన్నట్లుగా పరిస్థితులు మారాయి. హరికృష్ణ మరణం అనంతరం కూడా ఈ కోల్డ్ వార్ కి ఎండ్ కార్డు పడలేదు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో బాలకృష్ణకు విబేధాలు కొనసాగుతున్నాయి. దేవర చిత్రాన్ని బాలకృష్ణ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మనం చూశాం. నెగిటివ్ కామెంట్స్ తో దెబ్బతీయాలని చూశారు. కానీ దేవర మంచి విజయమే అందుకుంది.
ఇదిలా ఉంటే మోక్షజ్ఞకు పోటీగా హరికృష్ణ మనవడిని రంగంలోకి తెచ్చారు. ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ తెరకెక్కిస్తున్నాడు బాలకృష్ణ. ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని సమాచారం. ఇటీవల హీరోగా మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. విశేష స్పందన లభించింది.
తాజాగా మరో ఎన్టీఆర్ తెరపైకి వచ్చాడు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ కుమారుడైన నందమూరి తారక రామారావు సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అవుతున్నాడు. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు ఎన్టీఆర్ స్పెషల్ ఇంట్రడక్షన్ వీడియో విడుదల చేశారు. వైవిఎస్ చౌదరి పర్యవేక్షణలో అన్ని రంగాల్లోకి శిక్షణ తీసుకుని, మిమ్మల్ని అలరించేందుకు సిద్దమయ్యానని, ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తానంటూ ఎన్టీఆర్ ప్రమాణం చేశాడు.
నాలుగో తరం నందమూరి వారసుడు… నయా ఎన్టీఆర్ లుక్ అదిరింది. కుర్రాడు హీరో మెటీరియల్ అనడంలో సందేహం లేదు. లాంగ్ హెయిర్, కండలు తిరిగిన శరీరంతో మాస్ హీరో షేడ్స్ చూపించాడు. ఈ క్రమంలో మోక్షజ్ఞ వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్లు పరిస్థితి తయారైంది. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే టాక్ నడుస్తుంది. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ని దెబ్బ తీయాలని తారకరత్న ను బాలకృష్ణ రంగంలోకి దింపాడట. ఇప్పుడు మోక్షజ్ఞకు పోటీగా ఎన్టీఆర్… అన్నయ్య కొడుకు ఎన్టీఆర్ ని బరిలోకి లాగాడనే వాదన మొదలైంది.
వీరిద్దరి డెబ్యూ చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానుంది. మరి ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి. లుక్ పరంగా మోక్షజ్ఞ పై ఎన్టీఆర్ దే పై చేయి. అయితే వైవిఎస్ చౌదరి అవుట్ డేటెడ్ డైరెక్టర్. ఈ జనరేషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్టు ఉంటుందో లేదో. అదే సమయంలో ప్రశాంత్ వర్మ ఫార్మ్ లో ఉన్న యంగ్ డైరెక్టర్.