Billgates Total Property: అనుబంధాలు క్రమేపీ “మనీ” బంధాలు అవుతున్నాయి. ప్రాణం లేని నోటు కోసం ప్రాణం ఉన్న మనుషులు కొట్టుకుంటున్నారు. ఎదుటి వారిని తొక్కేయాలని.. అంతకంతకూ ఎదిగిపోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కోవిడ్ మనకు ఎన్నో గుణ పాఠాలు నేర్పినా మనుషులు ఇంకా మారలేదు. ఆ “మనీ” జాడ్యం మాసిపోలేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ₹ లక్షల కోట్లకు పడగలెత్తిన వారు కిందకి చూస్తున్నారు. ఆకాశ హర్మ్యాులలో ఉండే వారు సామాన్య జీవితాన్ని ఇష్ట పడుతున్నారు. డబ్బు, విలాసాలు, కులాసాలు, దిలాసాలు అనుభవించేవారు అవన్నీ వద్దు అనుకుంటున్నారు. ధనం మూలం కానీ జగత్ ముఖ్యం అని భావిస్తున్నారు. అపర కుబేరులయిన వారికి డబ్బు ఎందుకు చేదు అవుతున్నట్టు? ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత దానిమీద మొహం ఎందుకు మొత్తుతున్నట్టు?

…
తిరిగి ఇవ్వాలనే కోరికతో
…
వారెన్ బఫెట్, అజీం ప్రేంజి, శివ నాడార్, గౌతం అదానీ, జుకర బర్గ్, ఇప్పుడు తాజాగా బిల్ గేట్స్.. పై జాబితాలో ఉన్న వారంతా ఆగర్భ శ్రీమంతులు. ఈ ప్రపంచాన్ని శాసించే సత్తా ఉన్నవాళ్లు. కానీ సంపాదన ఒక స్థాయికి వచ్చిన తర్వాత పైసల మీద విరక్తి కలిగి మళ్లీ సామాన్య జీవితం గడపాలి అనుకుంటున్నవారు. అంతకంటే ముందు తమను ఈ స్థాయిలో నిలబెట్టిన సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలనే కృతజ్ఞతతో సంపాదించింది మొత్తం మళ్లీ తమలాంటి మనుషులకే ఇస్తున్నారు. మొన్నటికి మొన్న గౌతం అదాని 60 వేల కోట్ల రూపాయలను సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. దీనిని మరవకముందే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తన సంపాదన ₹లక్షా 60 వేల కోట్లు సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నట్టు ప్రకటించారు. బిల్ గేట్స్ సంచలన నిర్ణయంతో ప్రపంచమంతా ఆయనపై ప్రశంసలు కురిపిస్తోంది
…
బిల్ గేట్స్ నిర్ణయంతో
…
బహుశా ఈ ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ అంటే తెలియని వారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు అనుకుంటా. అలాగే బిల్ గేట్స్ అంటే తెలియని వారు కూడా ఉండరు. అంతలా చొచ్చుకుపోయింది మరి. ఎక్కడో అమెరికాలో రెండున్నర దశాబ్దాల క్రితం సిలికాన్ వ్యాలీలో చిన్నపాటి సంస్థగా ప్రారంభమైన మైక్రోసాఫ్ట్ ఎంతో ఎత్తుకు ఎరిగింది. కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చదివిన బిల్ గేట్స్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించారు. కోట్ల మంది పేదలకు కూడు, గూడు ఇచ్చారు. సతీమణి ( ఇప్పుడు విడాకులు తీసుకున్నారు) మెలిందా గేట్స్ తో కలిసి ఏర్పాటుచేసిన ఫౌండేషన్ దాదాపు ఈ ప్రపంచం లోని అన్ని దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఆప్రికా లాంటి వెనుకబడిన ఖండంలో ఎన్నో దేశాల్లో దాతృత కార్యక్రమాలు చేపడుతోంది. హెచ్ఐవి బారిన పడిన వారికి మందులు, పౌష్టికాహారం అందజేస్తోంది. వారు ఆర్థికంగా స్థిరపడేందుకు చేయూతను అందిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే బిల్ గేట్స్ సంస్థ చేసిన దాతృత కార్యక్రమాలకు అంతే ఉండదు.
…
అపర కుబేరుడు అయినప్పటికీ
…
అమెజాన్ సీఈవో జెఫ్ బేజోస్ వచ్చేంతవరకు బిల్ గేట్సే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ శ్రీమంతుడు. అతని సంస్థ మైక్రోసాఫ్ట్ కార్యాలపాలు ప్రపంచమంతా విస్తరించి ఉన్నాయి. ఎక్కడో సిలికాన్ వ్యాలీలో పుట్టిన ఆయన కంపెనీ ఈరోజు కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. అర్జన కూడా అదే స్థాయిలో ఉండటంతో బిల్గేట్స్ ప్రపంచంలోనే అందరికంటే ధనవంతుడు అయ్యాడు. కానీ డబ్బులు ఒక స్థాయిలో చూసిన తర్వాత విరక్తి వస్తుంది. బిల్ గేట్స్ కూడా అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఫలితంగా తాను సంపాదించిన సంపాదన మొత్తం సేవా కార్యక్రమాలకే వినియోగిస్తానని ప్రకటించారు. అది కూడా చిన్న మొత్తం కాదు. ఏకంగా లక్ష అరవై వేల కోట్లు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఒక రాష్ట్ర వార్షిక బడ్జెట్.
…
ఎందుకు ఈ నిర్ణయం
…
వారెన్ బఫెట్, బిల్ గేట్స్.. ఇద్దరు మంచి మిత్రులు. అయితే వీరిలో వారెన్ బఫెట్ ఇప్పటికే తన సంపాదన మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమాలకు ఇచ్చారు. ఇస్తున్నారు కూడా. ఇదే కోవలో ఒకసారి బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. తర్వాత ఇద్దరు మంచి మిత్రులయ్యారు. ఇద్దరు కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల తన భార్య మెలిందా గేట్స్ తో బిల్ గేట్స్ విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఆయన ఒంటరిగానే ఉంటున్నారు. ఇదే క్రమంలో తాను ఎంత సంపాదించినా ఇంకా పెరుగుతున్నది తప్ప తరిగే అవకాశం లేదు. వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చాం పోయేటప్పుడు ఒంటరిగానే పోతాం. అంతే తప్ప ఒక పైసా కూడా తీసుకెళ్లలేం. సరిగ్గా ఈ భావనే బిల్ గేట్స్ ను తన సంపాదన మొత్తం ప్రపంచానికే ఇచ్చేలా ప్రేరేపించిందని ఆయన సహచరులు అంటున్నారు. ఇక తన తాజా విరాళంతో వెనుకబడిన దేశాల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తానని బిల్ గేట్స్ అంటున్నారు. ఏమో తన లాంటి వారిని ఎంతమందిని తయారు చేస్తాడో చూడాలి.