BBC vs Trump controversy: British Broadcasting Corporation (BBC).. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మీడియా.. బీబీసీ లో ఒక వార్త వచ్చిందంటే అది కచ్చితంగా నిజమైందే అని అనుకుంటారు. అంతేకాకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక వార్త ప్రసారాన్ని చేయడానికి ఈ సంస్థ ఒప్పుకోదు. ఒకప్పుడు లండన్ లోనే ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో వార్తలను అందిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతోంది. అయితే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఈ మీడియా లో ఇద్దరు ప్రముఖులు ఇటీవల రాజీనామా చేశారు. ఒకరు బీబీసీ డైరెక్టర్ జనరల్, అలాగే బీబీసీ సీఈవో. ఈ ఇద్దరు రాజీనామా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ అతి ముఖ్యమైనవి అని ప్రసారం జరుగుతోంది. ఇంతకీ టాప్ పదవిలో ఉన్న వీరు ఒక్కసారిగా రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి? అసలు బీబీసీ లో ఏం జరిగింది?
ఒక వార్త బిబిసి లో వచ్చిందంటే చాలు.. అది కచ్చితంగా నిరూపణ అయినా న్యూస్ అని నమ్ముతారు. కానీ ఇటీవల బీబీసీలో పక్షపాతం కలిగిన వార్తలు వస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల్లో ముందుగా కొన్నిటిని చూద్దాం. వీటిలో ఒకటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్పీచ్ ను కొందరు వీడియో ఎడిటింగ్ చేసి తప్పుడుగా ప్రసారం చేశారు. 2021 జనవరి 6వ తేదీన డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన సందర్భంగా ఒక సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో అతడు ఓడిపోవడానికి గల కారణాలను ప్రస్తావిస్తూ కొన్ని వాక్యాలు చేశారు. We are going to walking to on capital.. and we are going to cheer on Congress men and women.. అంటే మనమంతా కలిసికట్టుగా వెళ్లి పార్లమెంటు ముందు నినాదాలు చేద్దాం అని అన్నారు. కానీ దీనిని ఎడిటింగ్ చేసి..We are going to walking to on capital.. అని పెట్టి 50 నిమిషాల తర్వాత మాట్లాడిన ఒక మాటను వీడియో కడిగేసి దీని ముందు ఉంచారు. అప్పుడు ఈ వాక్యం ఏమైందంటే.. We are going to walking to on capital.. and I will be there with fight.. అన్న వీడియోను ఉంచారు. అంటే ఇది కాస్త మనమంతా కలిసి క్యాపిటల్ హిల్ పై దాడి చేద్దాం.. అన్నట్లుగా ఎడిటింగ్ చేశారు. దీంతో అప్పట్లో కొందరు వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ పై ట్రంప్ మద్దతుదారులు దాడికి వెళ్లారు. వారిని ఆ తర్వాత అరెస్టు చేశారు.
ఈ వీడియో Enorama అనే డాక్యుమెంటరీలో ప్రసారమైంది. ఈ వీడియోను బిబిసి లో టెలికాస్ట్ చేశారు. అయితే అప్పటికే ఎన్నో వార్తల విషయంలో బీబీసీ పక్షపాత వైఖరితో ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఇజ్రాయిల్, హమాస్ మధ్య యుద్ధం జరిగినప్పుడు హమాస్ కు మద్దతుగా బీబీసీ లో వార్తలు ప్రసారం అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిపై బీబీసీ లోనే పనిచేసే కొందరు మేనేజ్మెంట్ స్థాయి వారి దృష్టికి తీసుకొచ్చారు. అయినా కూడా పట్టించుకోలేదు. అందులోనూ ఈ సంస్థలో కొందరు ప్రత్యేకంగా వార్తలు ప్రతికూలంగా రావడానికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి కారణాలతోనే బీబీసీలో టాప్ పొజిషన్లో ఉన్న ఇద్దరు రాజీనామా చేయాల్సి వచ్చింది. అంటే వార్తల విషయంలో బిబిసి ఎంతో నిక్కచ్చిగా ఉంటుంది. అలాంటి బీబీసీలో ఈ వార్తలు రావడానికి తమ నాణ్యత కోల్పోయినట్లు దానికి బాధ్యులుగా వీరు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.