Homeఅంతర్జాతీయంBangladesh Election Results 2026: బంగ్లాదేశ్ ఎన్నికల్లో అనూహ్య విజయం.. 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి...

Bangladesh Election Results 2026: బంగ్లాదేశ్ ఎన్నికల్లో అనూహ్య విజయం.. 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి ఆ పార్టీ?

Bangladesh Election Results 2026: బంగ్లాదేశ్‌లో ఏడాదిన్నర పాటు కొనసాగిన మహ్మదు యూనస్‌ పాలనకు తెరపడనుంది. షేక్‌ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏడాదిన్నర క్రితం దేశంలో అల్లర్లు చెలరేగాయి. హింసాత్మకంగా మారాయి. ఏకంగా ప్రధాని ఇంటిపైకే దాడి చేశారు నిరసనకారులు దీంతో షేక్‌ హసీనా పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. తర్వాత నోబెల్‌ బహుమతి గ్రహీత మహ్మద్‌ యూనస్‌ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. యూనస్‌ పూర్తిగా భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. చైనా, పాకిస్తాన్‌తో స్నేహం పెంచుకున్నారు. ఏడాదిన్నరగా దేశంలో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. మైనారిటీలు అయిన హిందువులపై దాడులు జరిగాయి. చాలా మందిని చంపేశారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల సమయంలోనూ హింస చెలరేగింది.

బీఎన్‌పీ విజయం…
బంగ్లాదేశ్‌ పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) ఘన విజయం సాధించింది. మొత్తం 299 స్థానాల్లో మిత్రాలతో కలిపి 212 స్థానాలు సాధించడంతో ప్రభుత్వ ఏర్పాటు మార్గం సుగమమైంది. గట్టి పోటీ ఇస్తుంది అనుకున్న జమాత్‌–ఏ–ఇస్లామీ 70 స్థానాలకే పరిమితమైంది. మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పొందారు.

15 ఏళ్ల తర్వాత తారిఖ్‌ రహ్మాన్‌ నాయకత్వం
మహ్మద్‌ ఖలీదా బేగం నేతృత్వంలో బీఎన్‌పీ పార్టీ గతంతో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. తర్వాత షేక్‌ హసీనా పార్టీ వరుసగా మూడుసార్లు గెలిచింది. దీంతో బీఎన్‌పీ 15 ఏళ్లు అధికారానికి దూరమైంది. ఖలీదా బేగం ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. దీంతో తారిఖ్‌ రహ్మాన్‌ పార్టీ పగ్గాలు చేపట్టారు. ఎన్నికల్లో పోటీ చేశారు. ఘన విజయం సాధించారు. బీఎన్‌పీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధపడుతోంది.

రెండు స్థానాల్లో తారిఖ్‌ విజయం..
ఈ ఎన్నికల్లో తారిఖ్‌ రహ్మాన్‌ రెండు చోట్ల పోటీ చేశాడు. ఢాకా 17, బోగ్రా 6 నియోజవర్గాల నుంచి బరిలో నిలిచారు. రెండు స్థానాల్లో ఓటర్లు ఆయనకు పట్టం కట్టారు. ఇక తల్లి ఖలీదా మరణం నేపథ్యంలో బీఎన్‌పీ విజయోత్సవాలకు దూరంగా ఉంది. కార్యకర్తలకు సాధారణ ప్రార్థనలు మాత్రమే నిర్వహించమని సూచించారు.

ఈ ఫలితాలు బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో పెద్ద మార్పును సూచిస్తున్నాయి. బీఎన్‌పీ మెజారిటీ సాధించడం వల్ల కొత్త పాలనా వ్యవస్థ ఆవిర్భవించే అవకాశం ఉంది. జమాత్‌–ఏ–ఇస్లామీ బలపడం వివాదాలను రేకెత్తించవచ్చు, కానీ స్థిరత్వానికి దోహదపడవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Oktelugu Epaper
Exit mobile version