HomeతెలంగాణThorrur Municipal Election Results: అక్కడ కారు పార్టీ గెలిచింది.. అత్తా కోడళ్ళ కు షాక్...

Thorrur Municipal Election Results: అక్కడ కారు పార్టీ గెలిచింది.. అత్తా కోడళ్ళ కు షాక్ తగిలింది

Thorrur Municipal Election Results: తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. అయితే అక్కడక్కడ కారు పార్టీ సంచలన విజయాలను నమోదు చేస్తోంది. కారు పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన మున్సిపాలిటీ స్థానాలలో తొర్రూరు ఒకటి.

తొర్రూరు మున్సిపాలిటీ పాలకుర్తి నియోజకవర్గంలో ఉంది. ఈ నియోజకవర్గంలో 2023లో జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే దయాకర్ రావు మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం సాధించింది. ఆమె గెలుపులో అత్త ఝాన్సీ రెడ్డి కీలకపాత్ర పోషించారు.

యశస్విని గెలుపు ద్వారా రేవంత్ రెడ్డి ఒకరకంగా దయాకర్ రావు మీద రివెంజ్ తీర్చుకున్నట్టు అయింది. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత యశస్విని రెడ్డి మొదట్లో నియోజవర్గంలో అభివృద్ధి పనులు బాగానే చేశారు. కాలక్రమంలో పార్టీలో అంతర్గత పోరు పెరిగిపోయింది. దీనికి తోడు ఝాన్సీ రెడ్డి వ్యవహార శైలి కొంతమంది నాయకులకు మింగుడు పడని విధంగా మారిపోయింది.

మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి విషయంలో ఝాన్సీ రెడ్డి వ్యవహరించిన తీరు ఒకరకంగా పార్టీలో ఉన్న అంతర్గత పోరును బయటపెట్టింది. ఈ క్రమంలోనే గత ఏడాది జరిగిన స్థానిక ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మెజారిటీ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. దీనికి ప్రధాన కారణం ఝాన్సీ రెడ్డి వ్యవహార శైలి అని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలో ఉన్న కొంతమంది నాయకులను పక్కన పెట్టడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని తెలుస్తోంది.

మరోవైపు తొర్రూరు మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సాధించింది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. ఇందులో 10 వార్డులను గులాబీ పార్టీ గెలుచుకుంది. ఆరు వార్డులను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. తద్వారా మున్సిపల్ పీఠాన్ని గులాబీ పార్టీ అధిరోహించబోతోంది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఈ పార్టీ విజయం సాధించడం గమనార్హం.

ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి కి ఈ ఫలితాలు ఒకరకంగా షాక్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా పార్టీలో ఉన్న అంతర్గత పోరును పరిష్కరించడానికి వారిద్దరు ముందడుగు వేయాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ ఫలితాలతోనైనా ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి కళ్ళు తెరవాలని కార్యకర్తలు సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Oktelugu Epaper
Exit mobile version