Balochistan vs Pakistan: బలూచిస్తాన్.. పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటోంది. ఇది పాకిస్తాన్లో అతిపెద్ద రాష్ట్ర జనాభా తక్కువగా ఉన్నా.. విస్తీర్ణం పరంగా 45 శాతం ఉంటుంది. అభివృద్ధికి దూరంగా ఉంటున్న ఇక్కడి ప్రజలు స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వంపై, సైన్యంపై బలూచ్ లిబరేసన్ ఆర్మీ(బీఎల్ఏ)పేరుతో తిరుగుబాటు చేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. విధ్వంసం సృస్టిస్తున్నారు. తాజాగా గడచిని 27 గంటల్లో 48 దాడులు చేశారు. దీంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసమైంది. 29 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు.
మైనింగ్ కార్యాలయంపై ఆత్మాహుతి దాడి..
ఇక పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో అరుదైన మినరల్స్ కోసం అమెరికా, చైనా పోటీ పడుతున్నాయి. పాకిస్తాన్ సైనికుల అనుమతితో ఇరు దేశాలు మైనింగ్ నిర్వహిస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రధాన కార్యాలయంపై బలూచ్ యువతి ఆత్మాహుతి దాడి చేసింది. కీలక మినరల్స్ స్థావరం ధ్వంసమైంది. బీఎల్ఏ గెరిల్లా ఆర్మీ ఇద్దరు చైనీయులను కిడ్నాప్ చేసింది. మరో గని సమీపంలో 15 మందిని ఎత్తుకెళ్లారు. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు జఫర్ ఎక్స్‌ప్రెస్‌పై ఆరుసార్లు బీఎల్ఏ దాడి చేసింది.
కిడ్నాప్‌పై చైనా ఆగ్రహం.. పాకిస్తాన్ మౌనం..
చైనా పాకిస్తాన్లో తమ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసి ఏరియల్ సర్వేలు చేపట్టింది. పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం అధికారిక ప్రకటనలు జారీ చేయకపోవడం ఆశ్చర్యకరం. సీపీఈసీ ప్రాజెక్టులపై దాడులు పాక్–చైనా సంబంధాలను ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు కిడ్నాప్‌ల వెనుక అమెరికా హస్తం ఉందని చైనా అనుమానిస్తోంది. పాకిస్తాన్ సహకారంతో ఈ కిడ్నాప్‌లు జరిగాయని భావిస్తోంది.
బీఎల్ఏ చైనీయుల విడుదలకు డిమాండ్లు పెడుతోంది, పాకిస్తాన్ బలహీన స్థితిలోకి చిక్కుకుంది. ఈ సంఘటనలు బలూచిస్తాన్ విభజనవాదాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. మరోవైపు ఈ దాడులు, కిడ్నాప్‌లపై పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ నుంచి ఎలాంటి ప్రకటన రావడం లేదు. నాయకులు మాట్లాడడం లేదు.