Pradeep Ranganathan Instagram chats: యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు ప్రదీప్ రంగనాథన్(PRadeep Ranganathan)..తమిళ యూత్ ఆడియన్స్ లో మాత్రమే కాకుండా, తెలుగు యూత్ ఆడియన్స్ లో కూడా ఈ కుర్ర హీరోకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సాధారణమైనది కాదు. నేటి తరం యుయువత ఆలోచనలకూ తగ్గట్టుగా సినిమాలు చేస్తూ , స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వనటువంటి అరుదైన రికార్డ్స్ ఎన్నో నెలకొల్పాడు ఈ కుర్ర హీరో. వరుసగా మూడు సార్లు 100 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన ఈ యువ హీరో నటించిన లేటెస్ట్ చిత్రం ‘LIK’ రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది . ఇదంతా పక్కన పెడితే ఈ హీరో గురించి సోషల్ మీడియా లో జరుగుతున్నా ఒక ప్రచారం హాట్ టాపిక్ గా మారింది.
ఇన్ స్టాగ్రామ్ లో ఈయన ఒక పాపులర్ లేడీ ఇన్ఫ్లుయెన్సుర్ కి చేసిన వ్యక్తిగత మెసేజిలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ‘మీరు చాలా అందంగా ఉన్నారు, నా తదుపరి సినిమాలో ఒక పాత్ర ఉంది , అందుకు మీరు పర్ఫెక్ట్ గా సరిపోతారు, ఆడిషన్స్ కి సిద్ధం గా ఉండండి , అంతకంటే ముందు మీరు నన్ను వ్యక్తిగతంగా కలవండి’ అంటూ తమిళం లో ఆ అమ్మాయికి కొన్ని మెసేజిలు చేశాడు. ఆ అమ్మాయి ఆడిషన్స్ ఇవ్వడానికి సిద్దంగానే ఉంది, చాలా ఆసక్తి కూడా చూపించింది. కానీ వ్యక్తిగతం గా కలవాలి అని అడిగేలోపు ఆ అమ్మాయికి కొన్ని అనుమానాలు వచ్చాయి. ‘ఆఫీస్ కి వచ్చి కలవొచ్చా..? ‘ అని ఆ అమ్మాయి అడగ్గా , ‘నా ఇల్లే నా ఆఫీస్’ అని ప్రదీప్ రంగనాథన్ సమాధానం ఇస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ‘క్షమించండి , ఈ వారం మొత్తం నా షెడ్యూల్స్ ఫుల్ అయిపోయాయి, కలవడం కుదరదు’ అంటూ చెప్పుకొచ్చింది.
వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని మీరు క్రింద చూడవచ్చు. అయితే ఇది కచ్చితంగా ప్రదీప్ రంగనాథన్ మెసేజిలు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఎవరో కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రదీప్ పేరిట ఫేక్ అకౌంట్ ని క్రియేట్ చేసి, ఈ చాట్ చేసి ఉండొచ్చు. కావాలని ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి చేసిన పని అయ్యుండొచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. అంతే కాకుండా AI
ద్వారా కూడా క్రియేట్ చేసిన స్క్రీన్ షాట్స్ అయ్యుండొచ్చు. అతి తక్కువ సమయం లోనే తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న ప్రదీప్ రంగనాథన్ అంటే ఇండస్ట్రీ లో పడని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది కచ్చితంగా వాళ్ళ పనే అయ్యుంటుందని అంటున్నారు. సోషల్ మీడియా లో వైరల్ అయిన ఈ కంటెంట్ పై ప్రదీప్ రెస్పాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.
E Pradeep Ranganath insta chats Nijamena ?
PR movies lo ammailu chala natural ga unte emo anukunna idha reason…
Emaina Thappuga undha chat ? Translate please someone. pic.twitter.com/pRge6lXHdR
— Vennela Kishore Reddy (@Kishoreddyk) April 8, 2026