Raghu Rama Krishnam Raju: ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు ఎన్నికయ్యారు. తనకు దక్కిన అరుదైన గౌరవంగా ఆయన భావిస్తున్నారు. అదేవిధంగా రఘురామకృష్ణంరాజును స్పీకర్ స్థానంలో చూసి కూటమి ఎమ్మెల్యేలు చలోక్తులు విసురుతున్నారు. గతంలో వైసీపీలో ఉన్న రఘురామకృష్ణ రాజు నరసాపురం ఎంపీగా కూడా ఉండేవారు. కొద్ది రోజులకే పార్టీతో విభేదించారు. దీంతో ఆయన చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. జగన్ సర్కార్ సొంత నియోజకవర్గంలో కూడా పర్యటించేందుకు ఒప్పుకోలేదు. సిఐడితో అరెస్టు చేయించి ఆయనపై విచారణ పేరిట దాడి కూడా జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు రఘురామకృష్ణంరాజు. అనూహ్య పరిస్థితుల్లో టిడిపి గూటికి వచ్చారు. ఎమ్మెల్యే అయ్యారు. అయితే గతంలో తనను బాధ పెట్టిన జగన్ పై రివేంజ్ తీర్చుకోవాలంటే తాను స్పీకర్ పదవిలో ఉండాలని రఘురామకృష్ణం రాజు భావించారు. తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు. కానీ ఆయనకు డిప్యూటీ స్పీకర్ గా ఛాన్స్ ఇచ్చారు రఘురామకృష్ణంరాజు. అప్పటినుంచి శాసనసభలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు రఘురామకృష్ణంరాజు. ఈ క్రమంలో కూటమి ఎమ్మెల్యేలతో ఆసక్తికరంగా గడుపుతున్నారు.
* చేనేత సమస్యలపై
ఈరోజు చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడారు అసెంబ్లీలో. ఈ క్రమంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి చేనేత కార్మికుల సమస్యలపై మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును ఉద్దేశించి మాట్లాడారు. చక్కటి పంచ కట్టులో డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన రోజు నేతన్నలకు సంఘీభావం తెలిపారంటూ ప్రశంసించారు. అనంతరం చేనేత రంగం పలు సమస్యలను ఎదుర్కొంటుందని.. ముఖ్యంగా మార్కెటింగ్ విషయంలో వెనుకబడుతున్నారని.. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ తరుణంలో ఆమె సుదీర్ఘంగా చేనేత రంగం సమస్యలపై మాట్లాడుతుండగా డిప్యూటీ స్పీకర్ అడ్డుకున్నారు. ప్రశ్నోత్తరాల సమయం కాబట్టి సుదీర్ఘచర్చలు అవసరం లేదన్నారు. నేరుగా మీ ప్రశ్న ప్రభుత్వానికి వేయాలని సూచించారు. దీంతో విలువైన సలహాలు ఇచ్చి ఆమె ముగించారు.
* వింత ప్రశ్న వేస్తూ
అయితే అప్పటివరకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి సుదీర్ఘంగా మాట్లాడేసరికి.. రఘురామకృష్ణంరాజు ఒక్కసారిగా స్పందించారు. ఇంతకీ మీరు వేసుకున్నది చేనేత చీర యేనా అని ప్రశ్నించేసరికి ఆమె అవునని చెప్పారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు వీరిసాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అసెంబ్లీలో రఘురామకృష్ణం రాజు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అయితే ఆయన చలోక్తులు చూస్తే.. రఘురాములు ఈ యాంగిల్ కూడా ఉందా అని సెటైర్లు పడుతున్నాయి. అదే సమయంలో సభాపతిగా మంచి మార్కులు పడుతున్నాయి.
మీరు ఇప్పటికే ఎక్కువ సూచనలు చేశారు. మీ శారీ చేనేతనేనా? – ఎమ్మెల్యే మాధవితో డిప్యూటీ స్పీకర్ రఘురామ #apassembly #raghurama pic.twitter.com/XZ1bW1UApc
— Journalist Ramanath (@JOURNORAMNATH) November 19, 2024