Asim Munir: ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్త క్షణాల్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను ‘శాంతి దూతగా’ ట్యాగ్ తగిలించుకున్నాడు. సీజ్ఫైర్ కుదిర్చింది తామే.. శాశ్వత శాంతి కుదిర్చేది తామే అన్నట్లుగా కాలర్ ఎగరేస్తున్నాడు. కానీ ఆసిమ్ డ్రామా ఇటు ఇరాన్‌కు, అటు అమెరికన్లకు అర్థమైంది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మాత్రం అర్థం కావడం లేదు. ఆసిమ్ ప్రయత్నాలు అనేక సందేహాలకు తావిస్తున్నాయి. ఈ ప్రాంతీయ శక్తుల మధ్య నడిచే దౌత్య ఆటల్లో మునీర్ పాత్ర విశ్వసనీయమైనదా లేదా వ్యూహాత్మకంగా ప్రమాదకరమైందా అనేది చర్చనీయాంశంగా మారింది.
వక్ర కోణంలో మద్యవర్తిత్వం
ప్రస్తుత ఇరాన్–అమెరికా సంఘర్షణ దశకు వచ్చిన సందర్భంలో మునీర్‌ను ట్రంప్ మధ్యవర్తిగా నియమించడాన్ని అమెరికా విధాన వర్గాలు ఒక రకంగా ‘‘ఉభయ పక్షాలతో సంబంధాలు కలిగిన ఒకే ముఖ్య నాయకుడి’’ ద్వారా సంప్రదింపులు నెరపాలనే తంత్రంగా అవగాహన చేసుకుంటున్నారు. అయితే, మునీర్‌కు ఏకకాలంలో అమెరికాతోపాటు ఇరాన్ ప్రముఖ సైనిక, విప్లవ దళ నాయకులతోనూ దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయనే వార్తలు కారణంగా ఈ పాత్రపై విశ్వాసం కంటే అనుమానాలే పెరుగుతున్నాయి.
ఇరాన్ ప్రముఖులతో సత్సంబంధాలు..
అహ్మద్ సయీద్ వంటి పాక్ మాజీ సైన్యాధికారుల ప్రకారం, మునీర్‌కు ఇరానీ రెవొల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ), దాని ప్రత్యేక దళం కుద్స్ ఫోర్స్ పొందికలతో దశాబ్దాల కాలంగా బంధాలు ఉన్నాయి. ఖాసీమ్ సులేమానీ, హోస్సేన్ సలామీ వంటి ప్రముఖ కమాండర్లతో జరిపిన చర్చలు, కొల్లాట సమన్వయాలు ఈ ముడి ప్రమాదకరమైన పొందికగా గుర్తుపెడుతూ విశ్లేషణ చేస్తున్నాయి. ఇలాంటి పొందికలు ఉన్న వ్యక్తిని అమెరికా ప్రతినిధిగా నియమిస్తే, అంతర్జాతీయ సంభాషణల్లో విశ్వసనీయత కాకుండా సందేహానికే తావిస్తున్నాయి. ్ర
మునీర్‌పై అమెరికన్ల అనుమానాలు..
అమెరికా విశ్లేషకులు మునీర్ ఇరు పక్షాలతోనూ బలమైన సంబంధాలు కలిగి ఉండటం వల్ల అతని దౌత్య పాత్రలో వ్యూహాత్మక ఇబ్బందులు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు శాంతి సందేశాలు మాట్లాడుతూ, మరోవైపు ఇరాన్ అంతర్గత సైనిక వర్తులతో ఉన్న సంబంధాల కారణంగా సమాచారం లీక్ అవ్వగానే పరిస్థితి మారవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా మునీర్ ‘‘ఇరు దేశాలతోనూ స్నేహం’’ కానీ ‘‘ఏ దేశానికీ పూర్తి సమర్పణ లేని’’ నాయకుడుగా కనిపిస్తున్నాడు. అందుకే అమెరికా విధాన వర్గాల్లో ఈ పాత్రపై పరిమిత విశ్వాసంతో మాత్రమే విచారణ జరుగుతోంది.
మానని అఫ్గాన్ యుద్ధ గాయం..
అఫ్గాన్ యుద్ధ కాలంలో పాకిస్తాన్, అమెరికా నుంచి భారీ సాయం స్వీకరిస్తూ కొన్ని ఉగ్రవాద నెట్వర్కులను తన భూభాగంలో కొంత మేరకు అనుమతించిన చరిత్ర ఉందని పశ్చిమాన విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఈ ఘటనలు పాక్‌పై దీర్ఘకాలిక అనుమానాలే కాకుండా, అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు ఈ దేశం ఎప్పటికప్పుడు కట్టుబడి పనిచేస్తుందనే ‘‘గ్యారెంటీ’’ ఏమాత్రం లేదని స్పష్టం చేస్తున్నాయి. ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ డెమోక్రసీస్‌కు చెందిన బిల్ రోజియోమ్ వంటి పలు పరిశోధకులు ఈ దేశం తన సాంప్రదాయిక అంతర్జాతీయ మిత్రుల ప్రయోజనాలకు ముందు అమెరికా లక్ష్యాలను రద్దు చేసే ప్రమాదం ఎప్పుడూ ఉందని హెచ్చరిస్తున్నారు.
మునీర్ వ్యక్తిగత సంబంధాలు, పాకిస్తాన్ చరిత్రాత్మక వైఖరి రెండూ కలిసి ప్రస్తుత పాత్రను ఒక రకంగా ‘‘అవకాశం’’గానూ, మరో రకంగా ‘‘ప్రమాదం’’గానూ చూపుతున్నాయి. ఒక వైపు ఇరాన్‌లోని ప్రముఖ కమాండర్లతో ఉన్న సంబంధాలు అమెరికాకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.