NRI News : తెలంగాణ రాష్ట్ర పండుగల్లో బతుకమ్మ, దసరా తర్వాత అత్యంత గుర్తింపు ఉన్న పండుగ బోనాలు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఈ వేడుకలు అద్దం పడతాయి. హైదరాబాద్‌లో నిర్వహించే వేడుకలకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈవేడుకల్లో పాలొనేందుకుం రాష్ట్రంలోని ఇతర జిల్లాలతోపాటు, పొరుగు రాస్ట్రాలకు చెందిన తెలుగువారు కూడా తరలివస్తారు. విదేశాల్లో ఉంటున్న వారు కూడా బోనాల వేడుకల్లో పాల్గొన్ని గ్రామదేవతలైన మహంకాలి, ఎల్లమ్మ, పోచమ్మ తదితర దేవతల దర్శనం కోసం వస్తారు. మొక్కులు తీర్చుకుంటారు. ఆషాఢమాసం వచ్చిందంటే హైదరాబాద్‌లో నెల రోజులపాటు సందడిగా మారుతుంది. ఏ కాలనీలోఇ వెళ్లిన గ్రామదేవతల పూజలు, బోనాలు కనిపిస్తాయి. ఇక బోనాల వేడుకల్లో పాల్గొనేందుకు రాలేని విదేశాల్లో ఉన్నవారు వారు ఉంటున్న ప్రదేశాల్లోనే పండుగలు జరుపుకుంటున్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల్లో ఎక్కువగా భారతీయ, తెలుగు పండుగలను జరుపుకుంటున్నారు. విద్య, ఉద్యోగాలకు వెళ్లి అక్కడే స్థిరపడిన కుటుంబాలు మన సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ పండుగలను నిర్వహిస్తున్నాయి. తెలుగువారి కోసం ఏర్పడిన వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహింరే వేడుకల్లో తెలుగురవారితోపాటు ఆయా దేశాలవారూ పాల్గొంటున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో తాజాగా బోనాల జాతరను ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్(మాటా) ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో తెలంగాణాలో ప్రత్యేకంగా అమ్మవారిని పూజించి బోనం సమర్పించే వేడుకలను వైబవంగా నిర్వహించారు. హైదరాబాద్ లాల్ దర్వాజ, లష్కర్ బోనాల వేడుకను తలపించేలా న్యూజెర్సీలోని ఎడిసన్‌లో సాయిదత్తపీఠం శ్రీ శివవిష్ణు దేవాలయంలో బోనాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వేడుకల్లో మహిళలు బోనాలు తయారు చేసి వాటిని నెత్తిన ఎత్తుకుని డప్పు చప్పుళ్లున పోతురాజు వేషధారుల విన్యాసాల నడము ఊరేగింపు నిర్వహించారు. అమెరికాలో తెలుగు ఆడపడుచులు బోనమెత్తడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా తెలుగు ప్రవాసీయులు సంప్రదాయ వస్త్రధారణలో వేడుకల్లో పాల్గొన్నారు. దేవాలయ నిర్వాహకులు, మాటా వారి సహకారంతో మహిళలంతా అమ్మవారికి పూజలు చేసి బోనం సమర్పించారు తెలంగాణ – అమెరికా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు.
ఆషాఢం.. చివరి ఆదివారం..
ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో నిర్వహించిన మహంకాళి బోనాలను డప్పు చప్పుళ్లతో, తొట్టెలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఊరేగింపులో చిన్న పెద్ద అని తేడాలేకుండా అందరూ డీజే పాటలకు నృత్యాలు చేశారు. ఈ వేడుకల్లో పోతురాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోకల్ టాలెంటును ఎప్పుడూ ప్రోత్సహించే ’మాటా’ బృందం ఈసారి కూడా పోతురాజుల విషయంలో లోకల్‌గా ఉండే వేణు గిరి, అశోక్ చింతకుంటను ఎంకరేజ్ చేసి అమెరికాలోను పోతురాజులు ఉన్నారనేలా చేశారు. మాటా అధ్యక్షులు శ్రీనివాస గనగోని తెలుగువారందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో రెండోసారి బోనాలు జాతర నిర్వహించడం, వందల సంఖ్యలో మహిళలు పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ’మాటా’ వైవిధ్యమైన, అందరికీ ఉపయోగకరమైన సేవా కార్యక్రమాలు చేసే అవకాశం కలగాలని, ఆ శక్తిని అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు
సమష్టి కృషితో విజయవంతం..
సాయిదత్తపీఠం నిర్వాహకలు రఘుశర్మ శంకరమంచి మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారిని స్వాగతించే పూజా కార్యక్రమం నుంచి బోనం సమర్పించడం వరకు కార్యక్రమాన్నీ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా జరిపించారు. ఈ వేడుకల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ దుద్దగి, సెక్రెటరీ ప్రవీణ్ గూడురు, ఎగ్జికూటివ్ కమిటీ సభ్యులు స్వాతి అట్లూరి, శ్రీధర్ గూడాల, బోర్డు అఫ్ డైరెక్టర్ కృష్ణ శ్రీగంధం, మాటా కార్యవర్గం, కృష్ణ సిద్దాడ, శిరీష గుండపునేని ఆధ్వర్యంలో వెంకీ మస్తీ, కళ్యాణి బెల్లంకొండ, పూర్ణ భేడిపూడి, మల్లిక్ రెడ్డి సహాకారంతో ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు, రీజినల్ కో–ఆర్డినేటర్లతోపాటు గిరిజ మదాసి అలంకరణ చేసేందుకు సహాయం చేశారు. మరోవైపు.. మాధురి, ప్రసూన, నీలిమ, శిల్పతోపాటు పలువురు సభ్యులు ఈ బోనాల ఏర్పాట్లలో సహకరించారు. సాయిదత్త పీఠం నుంచి పూర్ణిమ, రంజిత ఈ సంబురాల్లో తమ వంతు సహకారం అందించారు. మాటా పిలుపు మేరకు అమెరికా వ్యాప్తంగా స్థిరపడిన తెలుగు రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు పెద్ద సంఖ్యంలో ఈ బోనాల జాతరలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ.. మాటా నిర్వహాకులు ధన్యవాదాలు తెలిపారు. జూలై 28న డల్లాస్, ఆగస్టు 3న అట్లాంటాతోపాటు ఫిలడెల్ఫియాలోనూ బోనాల పండుగ నిర్వహించనున్నట్లు మాటా నిర్వాహకులు తెలిపారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Ashadha bonalu in america management under the leadership of mata
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com