Producer SKN: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా తయారయింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్ హీరోలు వాళ్ళు చేసిన సినిమాలతో విపరీతమైన నష్టాన్ని తెచ్చి పెడుతున్నారు. దీనివల్ల ప్రొడ్యూసర్లకు భారీ నష్టాలైతే వస్తున్నాయి. తద్వారా ఈ సినిమాలతో ఎవరికి వారు వాళ్ళ సినిమాలను హైలెట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికి సినిమాల్లో కంటెంట్ ఉండకపోవడంతో ఆ సినిమాలు చాలావరకు నిరుత్సాహపరుస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే చిన్న నిర్మాతలు సైతం సక్సెస్ ను సాధించాలంటే తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేయడమే ఉత్తమం అని వాళ్ళు మంచి కాన్సెప్ట్ తో కొన్ని సినిమాలు చేస్తున్నారు..ఇక రీసెంట్ గా చిన్న నిర్మాత అయిన ఎస్ కే ఎన్ మాట్లాడుతూ ప్రొడ్యూసర్ కి సొంతగా సక్సెసులనేవి ఉండవు. అవి హీరోల ద్వారా గాని, దర్శకుల ద్వారా గాని వచ్చిన సక్సెసులే తప్ప సొంతంగా చెప్పుకోవడానికి ప్రొడ్యూసర్స్ ద్వారా సక్సెస్ అయిన సినిమాలు అయితే ఏమీ లేవు అంటూ ఒక మాటనైతే కచ్చితంగా చెప్పాడు.
దానికి కారణం ఏంటి అంటే ప్రొడ్యూసర్ యొక్క బాధ్యత సినిమాకి డబ్బులు పెట్టడం… కథలో గాని, కథనంలో గాని ఆయనకి ఎలాంటి సంబంధం ఉండదు… ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన చిన్న సినిమాలైతే మంచి విజయాలను సాధిస్తుండడంతో ఆయన అలాంటి వ్యాఖ్యలైతే చేశాడు.
మరి ఏది ఏమైనా కూడా ఎస్ కే ఎన్ చేసిన మాటల్లో అర్థమైతే ఉందని చాలామంది ఆయన మాట్లాడిన మాటలకు రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారు. మంచి సినిమాలు వచ్చి సూపర్ సక్సెస్ లను సాధిస్తే సైతం ఇండస్ట్రీ బాగుపడుతుందని ప్రతి ఒక్కరు చెబుతుండడం విశేషం…
ఇక ఇదంతా చూస్తున్న నెటిజన్లు సైతం కంటెంట్ బాగుండటం తో రీసెంట్ గా రిలీజ్ అయిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా సూపర్ సక్సెస్ అయితే సాధించింది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు, తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతోంది అనేది.