Anti-Govt Protest Rages In UK: మా దేశంలో మేమేం ఉండాలి.. మా దేశం మాకే సొంతం కావాలి.. అన్న నినాదంతో నిన్నటి వరకు అమెరికాలో జరిగిన నిరసనలు ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ లోనూ పెల్లుబికుతున్నాయి. గత రెండు నెలల నుంచి బండల్లో వలసవాదుల వ్యతిరేకంగా నిరసనలు హోరేత్తుతున్నాయి. బ్రిటన్ దేశంలోకి అక్రమంగా కొందరు వలసలు వచ్చారని.. వారిని వెంటనే వెనక్కి పంపాలని లండన్ ప్రధాన వీధుల్లో భారీ ప్రదర్శన చేపడుతున్నారు. విదేశీయులను దేశం నుంచి బయటకు పంపాలనే ఉద్దేశంతో యాంటీ ఇమిగ్రేషన్ కార్యకర్త, అతివాద నాయకుడు టామీ రాబిన్సన్ పిలుపుమేరకు ‘యునైటెడ్ ద కింగ్డమ్ ర్యాలీ’పేరుతో చేపట్టిన ప్రదర్శన ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత కూడా ర్యాలీలు కొనసాగుతుండడం గమనార్హం.
గత కొన్ని సంవత్సరాలుగా ఇతర దేశాల నుంచి బ్రిటన్ లోకి వలసవాదులు వస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. మీరు ఎక్కువగా బోటు ద్వారా దేశంలోకి వస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా విదేశీయులు ఎక్కువ కావడంతో దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణంగా ఒత్తిడిలో పెరుగుతున్నాయి. అంతేకాకుండా 2025 అక్టోబర్ 29న బ్రిటన్, వియత్నాం మధ్య ఒక ఒప్పందం నమోదయింది. వియత్నాం నగరంలోని వలస కారులను బ్రిటన్ తీసుకోవడమే ఈ ఒప్పందం.. ఇదే ఆగస్టులో ఫ్రాన్స్ తో మరో ఒప్పందం జరిగింది.
అయితే దేశంలో వలస కారులు పెరిగిపోవడంతో ఇక్కడి వారికి ఉద్యోగ అవకాశాలు, వ్యాపార లాభాలు కోల్పోతున్నామని కొందరు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వ్యతిరేక ప్రదర్శనలు చేస్తున్నారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ మాత్రం వలస కారుల వ్యతిరేక ప్రదర్శనలు సహించబోమ్ అని అంటున్నారు. దీంతో ఆందోళనకారులు ప్రధానిపై విమర్శలు చేస్తూ వలస కారులను తిరిగి పంపేయండి అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా సెప్టెంబర్ లో నిర్వహించిన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు వలస కారులకు వ్యతిరేకర ప్రదర్శన జరుగుతుంటే మరోవైపు జాత్యాహంకారం అంటూ చేసిన ప్రదర్శన తో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కొంతమంది గాయపడ్డారు.
అయితే ఈ వలసవాదుల వ్యతిరేక ప్రదర్శనలకు నిరసనగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు విదేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారు.. మరోవైపు వలసవాదులకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసిన వారి మధ్య ఉద్రిక్తత ఏర్పడడంతో.. కొందరు సామాన్యులపై కూడా దాడులు చేస్తున్నారు. అంతేకాకుండా స్థానిక ప్రజల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ తరుణంలో వలసవాదుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. లేకుంటే పరిస్థితి చేయి దాటిపోయి దేశం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.