US access denied Anthropic AI: పొరుగు దేశాల మీద మాత్రమే కాదు.. చివరికి సొంత దేశంలో సంస్థలను కూడా వదిలిపెట్టడం లేదు ట్రంప్. తన ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థలకు ట్రంప్ చుక్కలు చూపిస్తున్నాడు. ఈ జాబితాలో ఇప్పుడు ఆంథ్రోపిక్ వచ్చి చేరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అత్యంత ఆధునికమైన టూల్స్ తయారు చేస్తోంది ఈ కంపెనీ. ఈ కంపెనీ తయారు చేసిన ఫ్యాబిల్ 5, మితోస్ 5 సేవలు అమెరికాలో నిలిచిపోయాయి.
విడుదల చేసిన మూడు రోజులకే
ఆంథ్రోపిక్ సంస్థ ఫ్యాబిల్ 5 సేవలను మూడు రోజుల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చింది.. ఈ సేవలను అమెరికా నిలిపివేసింది.. మితోస్ 5 సేవలను కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. భద్రతాపరమైన ఆందోళనల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.. ఫ్యాబిల్ 5, మితోస్ 5 టూల్స్ లోపాలను హ్యాకర్లు అత్యంత పటిష్టమైన సాఫ్ట్ వేర్ ద్వారా గుర్తిస్తారని.. అందువల్ల వీటిపై ఆంక్షలు విధిస్తున్నామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ ఆంథ్రోపిక్ సంస్థకు లేఖ రాశారు.
అప్పుడు వెలుగులోకి
ప్రాజెక్టు గ్లాస్ వింగ్ లో భాగంగా ఆంథ్రోపిక్ క్లౌడ్ మితోస్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఇది అత్యంత అధునాతన ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. ఆయా సంస్థలలో ఉన్న సాఫ్ట్వేర్ లోపాలను గుర్తిస్తుంది. ఆంథ్రోపిక్ రూపొందించిన ఫ్యా బిల్ 5, మితోస్ 5 టూల్స్ లో యాక్సెస్ ఇతర వ్యక్తులకు ఇవ్వడం అమెరికా ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించింది. అమెరికా ప్రభుత్వానికి యాక్సెస్ ఇవ్వకపోవడం వల్లే ఆంథ్రోపిక్ మీద ట్రంప్ ప్రభుత్వం లేనిపోని ఆరోపణలు చేసింది.
వాస్తవానికి ప్రస్తమా అందుబాటులో ఉన్న అనేక కమర్షియల్ టూల్స్ లో లోపాలు ఉన్నాయి. సులువుగా హాకింగ్ చేయవచ్చు. అయితే అమెరికా ప్రభుత్వం తీసుకున్న పనికిమాలిన నిర్ణయం వల్ల ఆంథ్రోపిక్ కు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఏ ఐ టూల్స్ మీద కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. రీసెర్చ్ వింగ్ లో అనేక రకాల ప్రయోగాలు చేసిన తర్వాతే.. టెస్టింగ్ దశలు విజయవంతంగా పూర్తయిన తర్వాతే టూల్స్ ను బయటికి తీసుకొస్తారు. కమర్షియల్ టూల్స్ ను ఆయా కంపెనీలు భారీ ధరకు అమ్ముతుంటాయి. కానీ అమెరికా ప్రభుత్వం అత్యుత్సాహం వల్ల ఆంథ్రోపిక్ రూపొందించిన ఏఐ కమర్షియల్ టూల్స్ రీ కాల్ చేసుకోవాల్సి వచ్చింది.
ఆంథ్రోపిక్ సంస్థ మనదేశంలో కొన్ని కంపెనీలకు గతంలో రూపొందించిన ఏఐ టూల్స్ కు యాక్సెస్ ఇచ్చింది. ఇది అమెరికా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. చివరికి ఈ రూపంలో రివెంజ్ తీర్చుకుంది. ఇది ఆంథ్రోపిక్ కంపెనీకి తీవ్రమైన నష్టం కలగజేసింది. ఈ నష్టాన్ని ఆంథ్రోపిక్ ఎలా భర్తీ చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

