Mark Zuckerberg: చెప్పింది వింటాడు.. ఏం చేయాలో అదే చేస్తాడు..

ఆదివారం "లెన్నీస్ పోడ్ కాస్ట్" ద్వారా లెన్ని రాచిట్ స్కి అనే హోస్ట్ ఆండ్రూ బోజ్ బోస్ వర్త్ ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ఆండ్రూ బోజ్ బోస్ వర్త్ వెల్లడించాడు.

Written By: Suresh, Updated On : March 6, 2024 12:27 pm

Mark Zuckerberg

Follow us on

Mark Zuckerberg: ఎటువంటి ఆర్థిక నేపథ్యం లేదు.. తన మెదడులో ఒక పుట్టిన ఆలోచనను ఆచరణలో పెట్టాడు. అలా ఫేస్ బుక్ ను ఏర్పాటు చేశాడు. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ధనవంతుడిగా ఎదిగాడు. ఫేస్ బుక్ మాత్రమే కాదు ఇన్ స్టా గ్రామ్ ను కూడా కొనుగోలు చేశాడు.. ట్విట్టర్ ఎక్స్ కు పోటీగా థ్రెడ్స్ ను నెలకొల్పాడు. అలాంటి జూకర్ బర్గ్ ఎలా ఉంటాడు? తోటి ఉద్యోగులతో ఎలా వ్యవహరిస్తాడు? శ్రీమంతుడైనప్పటికీ అతడి వ్యవహార శైలిల ఎలా ఉంటుంది? వీటిపై మెటా సీటీవో ఆండ్రూ బోజ్ బోస్ వర్త్ సంచలన విషయాలు వెల్లడించాడు.

ఆదివారం “లెన్నీస్ పోడ్ కాస్ట్” ద్వారా లెన్ని రాచిట్ స్కి అనే హోస్ట్ ఆండ్రూ బోజ్ బోస్ వర్త్ ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ఆండ్రూ బోజ్ బోస్ వర్త్ వెల్లడించాడు. ” మార్క్ ఎన్నో సమావేశాలకు హాజరవుతాడు. అవి అతడికి సంబంధం ఉన్నవి కావచ్చు, లేనివి కావచ్చు. అయినప్పటికీ హాజరవుతాడు. ప్రతిపాదిత ఆలోచన గురించి ఏమనుకుంటున్నారో చుట్టూ ఉన్న సభ్యులను అడుగుతాడు. ఒత్తిడి పరీక్షించేందుకు తన వంతు ప్రయత్నాలను ప్రయోగిస్తాడు. తర్వాత విభిన్న దృక్కోణాలను పరిశీలిస్తాడు. తర్వాత అంతిమ నిర్ణయం తీసుకుంటాడు. ఒకవేళ ప్రస్తుత మార్పులు అతడికి నచ్చకపోతే.. గతంలో తొలగించిన మార్పులను అమలు చేయడం మొదలు పెడతాడు” అని ఆండ్రూ బోజ్ బోస్ వర్త్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

“ప్రస్తుతం ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉంది. ఆ ప్రభావం ఫేస్ బుక్ పై కూడా పడింది. చాలామందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. మలిదశల్లో కూడా ఇది కొనసాగుతుంది. రాబోయే వారం లేదా మరి కొద్ది రోజుల్లో విడతల వారీగా ఉద్యోగులను పని చేయించే అవకాశాలను మాస్క్ పరిశీలిస్తున్నారు. ప్రతి విషయాన్ని మార్క్ అత్యంత తీవ్రంగా సంగ్రహిస్తాడు. రోజు రాత్రి ఇంటికి తిరిగి వెళ్లే ముందు అన్నింటిని ఒకసారి చేసే పని ఏదైనా ఉంటే వెంటనే అతడు తీసుకునే నిర్ణయాలు ఎందుకు అలా ఉంటాయో మనకు చెప్పడని” ఆండ్రూ బోజ్ బోస్ వర్త్ వెల్లడించాడు.

2006లో AOL ఇన్ స్టంట్ మెసేజ్ సంభాషణలో హార్వర్డ్ విద్యార్థులు తమ సమాచారాన్ని అందజేయడంలో విఫలమయ్యారు. అప్పుడు వారిని మార్క్ ఒక రకమైన పదంతో విమర్శించాడు. అది అప్పట్లో వివాదానికి దారి తీసింది..మార్క్ 2012లో ఫేస్ బుక్ బోర్డుకు తెలియకుండా ఇన్ స్టా గ్రామ్ ను బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశాడు. అది కూడా అప్పట్లో వివాదానికి కారణమైంది. ఆ తర్వాత ఈ నిర్ణయాలను మార్క్ సమర్ధించుకున్నాడు.. ప్రస్తుతం ఫేస్ బుక్ లో సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఆండ్రూ బోజ్ బోస్ వర్త్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే వీటిని మార్క్ పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది.