America: అమెరికాలో భారతీయుల మరణాలు కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు హత్యలు, అనుమానాస్పద మరణాలు జరిగాయి. తర్వాత పోలీస్ వాహనం ఢీకొని ఓ యువతి దుర్మరణం చెందింది. ఇక తాజాగా ఆంధ్రాకు చెందిన ఓ మహిళ యాక్సిడెంట్‌లో మరణించింది. దంతో పెనుగంచిప్రోలులో విషాదం నెలకొంది.
పోర్టులాండ్‌లో ఘటన..
అమెరికా పోర్టులాండ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కొణకంచికి చెందిన మహిళ కమతం గీతాంజలి(32) మృతిచెందింది. ఈమేరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కారులో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గీంతాంజలి కూతురు హానిక అక్కడికక్కడే మృతిచెందింది. ఇదే ప్రమాదంలో గాయపడిన గీతాంజలి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో సోమవారం(ఏప్రిల్ 1న) మృతిచెందింది.
చికిత్స పొందుతున్న భర్త, కుమారుడు..
ఇక ఇదే ప్రమాదంలో గాయపడిన గీతాంజలి భర్త నరేశ్, కుమారుడు బ్రమణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లి, కుమార్తె మృతి చెందడంలో బంధువుల కుటుంబాల్లో విషాదం అలుముకుంది. వారి మృతదేహాలను స్వగ్రామం కొణకంచికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.