US Report: భారత్‌లో మానవ హక్కుల పరిస్థితులపై అమెరికా నివేదిక విడుదల చేసింది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికా నివేదిక పూర్తిగా పక్షపాతంతో కూడుకున్నదని పేర్కొంది. సరైన అవగాహన లేకదనడానికి ఈ నివేదిక నిదర్శనమని పేర్కొంది. గతేడాది మణిపూర్‌లో హింస చెలరేగిన తర్వాత ఆ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆ నివేదిక పేర్కొంది.
స‍్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ..
అమెరికా నివేదికపై విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. యూఎస్ నివేదిక తీవ్ర పక్షపాతంలో కూడుకుందని తెలిపారు. భారత్‌పై సరైన అవగాహన లేండా దీనిని రూపొందించినట్లు ఉందని పేర్కొన్నారు. దీనిని తాము పరిగణనలోకి తీసుకోమని, మీడియా కూడా పట్టించుకోవాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.
నివేదికలో ఏముంది?
ఇదిలా ఉండగా 2023 కంట్రీ రిపోర్ట్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ ప్రాక్టిసెస్ ఇండియా పేరుతో అమెరికా ఈ నివేదిక విడుదల చేసింది. ఇందులో మణిపూర్‌లో మైతీ, కుకీ వర్గాల మధ్య చెలరేగిన వివాదం మానవ హక్కుల ఉల్లంఘనకు దారి తీసినట్లు పేర్కొంది. ఈ ఘటనను ప్రధాని నరేంద్రమోదీకి సిగ్గుచేటని తెలిపింది. చర్యలు తీసుకోవాలని కోరినట్లు కూడా నివేదిక పేర్కొంది. జమ్మూకశ్మీర్‌లో పలువురు జర్నలిస్టులు, మానవహక్కుల నేతలను విచారణ చేశారనే నివేదికలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది.
ఇవీ కూడా..
ఈ నివేదికలో గతేడాది ఫిబ్రవరిలో ముంబై, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయలపై దర్యాప్తు సంస్థల దాడిని ప్రస్తావించింది. మోదీపై డాక్యుమెంటరీ, మోదీ ఇంటి పేరును కించపరిచిన కేసులో రాహుల్ గాంధీకి శిక్ష పడటం, ఆయన లోక్‌సభ అనర్హతకు గురికావడం, మళ్లీ సుప్రీంకోర్టు స్టేతో ఎంపీ పదివి తిరిగి పొందిన తీరును కూడా పేర్కొంది. ఇక కెనడాలో ఖలీస్తానీ ఉగ్రవాది హత్య వంటి అంశాలను కూడా నివేదికలో అమెరికా ప్రస్తావించింది.