America: అగ్రరాజ్యం అమెరికాకు విద్య, ఉద్యోగాల కోసం వెళ్లిన విదేశీయులను విదేశీయులను వెళ్లగొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే అక్రమ వలసల పేరుతో కొందరిని పంపించారు. హమాస్‌కు మద్దతు తెలిపారని కొందరి వీసాలు రద్దు చేశారు. తర్వాత వాహనాలు స్పీడ్‌గా నడుపొద్దని నిబంధన విధించారు. ఇప్పుడు మరో రూల్ తెచ్చాడు తిక్క ట్రంప్. విదేశీయులే టార్గట్‌గా దీనిని తక్షణం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: స్వాతంత్రోద్యమ చరిత్రకెందుకు ఇన్ని వక్రభాష్యాలు
అమెరికా(America)లో ఎక్కువ కాలం నివసిస్తున్న విదేశీ జాతీయులు తప్పనిసరిగా ఫెడరల్ ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. చట్టవిరుద్ధంగా దేశంలో ఉండిపోయే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు, జైలు శిక్షలు, లేదా దేశం నుంచి బహిష్కరణ వంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని DHS తెలిపింది.
రిజిస్ట్రేషన్ ఎందుకు తప్పనిసరి?
అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్న విదేశీయులు తమ ఉనికిని ఫెడరల్(Fedaral) ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని DHS ఆదేశించింది. ఈ నిబంధన దేశ భద్రత, ఇమ్మిగ్రేషన్(Immigration) విధానాల అమలును బలోపేతం చేయడంలో భాగంగా చేపట్టిన చర్యగా భావిస్తున్నారు. చట్టపరమైన డాక్యుమెంట్లు లేకుండా దేశంలో ఉండిపోయే వారిని గుర్తించి, వారిపై తగిన చర్యలు తీసుకోవడమే ఈ రిజిస్ట్రేషన్ లక్ష్యం. ‘‘ఈ నిబంధనను ఉల్లంఘిస్తే నేరంగా పరిగణించి, అపరాధ రుసుములు, జైలు శిక్షలు విధిస్తాం. అందుకే స్వచ్ఛందంగా రిజిస్టర్ చేసుకోవడం లేదా సొంతంగా దేశం వీడడం ఉత్తమం’’ అని ఈఏ ఒక ప్రకటనలో తెలిపింది.
స్వచ్ఛందంగా దేశం వీడితే ప్రయోజనాలు
DHS ప్రకారం, చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉండిపోయిన వారు స్వచ్ఛందంగా దేశం వీడితే వారికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
జరిమానాల నుంచి విముక్తి: స్వచ్ఛందంగా వెళ్లిపోతే భారీ జరిమానాలు, శిక్షల నుంచి తప్పించుకోవచ్చు.
ఆస్తి రక్షణ: నేర నేపథ్యం లేని వారు అమెరికాలో సంపాదించిన సొమ్మును సురక్షితంగా తమతో తీసుకెళ్లవచ్చు.
రాయితీ విమాన టికెట్లు: ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి విమాన టికెట్లపై రాయితీలు అందించేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
‘‘మీ సామాను సిద్ధం చేసుకొని స్వచ్ఛందంగా విమానం ఎక్కండి. ఇదే ఉత్తమ మార్గం’’ అని DHS సూచించింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే..
నిబంధనలను పాటించని వారు కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని DHS హెచ్చరించింది.
భారీ జరిమానాలు: ఫైనల్ ఆర్డర్ అందుకున్నవారు ఒక్క రోజు అధికంగా ఉంటే రోజుకు 998 డాలర్ల జరిమానా విధించబడుతుంది. గడువు ముగిసిన తర్వాత దేశం విడిచి వెళ్లని వారిపై 1,000 నుంచి 5,000 డాలర్ల వరకు జరిమానా విధిస్తారు.
జైలు శిక్ష: కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.
బహిష్కరణ: తక్షణమే దేశం నుంచి బహిష్కరించబడతారు.
భవిష్యత్ ప్రవేశ నిషేధం: బహిష్కరించబడిన వారికి భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశం నిషేధించబడుతుంది.
ఎవరికి వర్తిస్తాయి?
ఈ నిబంధనలు ప్రధానంగా చట్టపరమైన అనుమతులు లేకుండా అమెరికాలో నివసిస్తున్న విదేశీయులపై అమలు చేయబడతాయి. అయితే, కొన్ని మినహాయింపులు, షరతులు ఉన్నాయి.
H-1B విద్యార్థి వీసాదారులు: H-1B వీసా, విద్యార్థి వీసాలపై ఉన్నవారికి ఈ నిబంధనలు నేరుగా వర్తించవు. అయితే, వీసా నిబంధనలను ఉల్లంఘిస్తే లేదా వీసా గడువు ముగిసిన తర్వాత నిర్ణీత సమయం దాటి దేశంలో ఉంటే చర్యలు తప్పవు.
ఉద్యోగ నష్టం: అమెరికాకు హెచ్–1బీ వీసాపై వచ్చి ఉద్యోగం కోల్పోయినవారు గడువులోపు దేశం వీడాలి. లేదంటే ఈ నిబంధనల కింద చర్యలు ఎదుర్కోవచ్చు.