America Women : మనిషి బతికున్నప్పుడు మంచి బతకాలి. పాపాలు చేస్తే నరకానికి వెళ్తారు.. మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తారు.. అందువల్ల ధర్మం, నీతి , నిజాయితీతో ఉండాలి.. ఎవరినీ హింసించకూడదు.. ఎటువంటి తప్పులు చేయకూడదు.. అని కొందరు చెబుతూ ఉంటారు. చనిపోయిన తరువాత అసలు జీవితమే ఉండదు… పాపం, పుణ్యం ఎక్కడిది? అని కొందరు హేళన చేస్తారు. కానీ గరుడ పురాణం ప్రకారం ప్రతీ మనిషి చేసిన పాపానికి శిక్ష అనుభవించక తప్పదు అని ఉంటుంది. తాను చేసిన పాపాలను బట్టే శిక్షలు ఉంటాయని చెబుతుంది. అలాగే పుణ్యం చేయడం వల్ల స్వర్గానికి వెళ్తారని చెబుతారు. అయితే ఓ మహిళ రియల్ గా స్వర్గం, నరకం చూసి వచ్చిందట. ఆమె చనిపోయారని అందరూ అనుకుంటున్న సమయంలో తిరిగి బతకడంతో అందరూ షాక్ అయ్యారు. బతికిన తరువాత అమె స్వర్గం, నరకం కు సంబంధించిన కొన్ని ఆనవాళ్లు చెప్పింది. ఆమె ఏం చెప్పిందంటే?
కొందరు నిద్రపోతున్న సమయంలో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. వారికి తెలియకుండానే కొన్ని అవయవాలను కదిలిస్తూ ఉంటారు. ఇలాగే అమెరికాకు చెందిన ఓ మహిళ 11 నిమిషాల పాటు చనిపోయిందని అనుకున్నారు. కానీ ఆ సమయంలో ఆమె చెప్పేమాటలు, చేసే సైగలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. కాన్సాస్ రాష్ట్రంలోని విచిటా సిటీకి చెందిన చార్లెట్ హోమ్స్ అనే మహిళకు 2019లో బ్లడ్ ప్రెషర్ పెరిగింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సమయంలో 11 నిమిషాల పాటు ఆమె శరీరం పనిచేయలేదు. చికిత్సకే ఏమాత్రం సహకరించలేదు. దీంతో ఆమె మరణించిందని అనుకున్నారు. కానీ ఆ తరువాత ఆమె కోలుకుంది. కొన్నాళ్ల పాటు సాధారణ వ్యక్తిలా జీవించింది.
అయితే ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. తాను ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనకు స్పృహ లేని సమయంలో తన భర్త డాన్వీ పక్కనే ఉన్నాడు. కానీ ఆమె పూల గురించి మాట్లాడింది. కానీ ఆసుపత్రిలో ఎక్కడా పూలు కనిపించలేదు. అలాగే కదులుతున్న గడ్డ అందమైన ప్రదేశం గురించి చెప్పింది. కొందరు దేవ దూతలు తాను నడుస్తుంటూ ఎదురైనట్లు చెప్పింది. ఇదే సమయంలో తన కుటుంబ సభ్యులు ఎప్పుడో మరణించిన వారు అక్కడ వారిని కలుసుకుందట. వారు 30 ఏళ్ల వయసులో ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించారు. మరోవైపు తన గర్భంలో చనిపోయిన కొడుకు ఒక కాంతి వద్ద కనిపించాడు. అతను అక్కడే పెరుగుతున్నట్లు అనుకుంది. కాసేపు ఇలా ఉన్న తరువాత ఒక్కసారిగా ఏడుపు శబ్దాలు వినిపించాయి. కుళ్లిన వాసన వచ్చింది. కొందరు అరుస్తున్నట్లు అనిపించింది. ఎవరో తన శరీరాన్ని పట్టి లాగినట్లు అనిపించిందని చార్లెట్ వివరించారు.
పూలు, గడ్డి అందమైన ప్రదేశం స్వర్గం అని… కుళ్లిన మాంసం, అరుపును నరకం అని చార్లెట్ చెప్పుకొచ్చారు. చనిపోయిన తరువాత కూడా జీవితం ఉంటుందని ఆమె గట్టిగా నమ్ముతున్నట్లు చెప్పారు. ఆమె తన అనుభవాలను పలు ఇంటర్వ్యూల ద్వారా వెల్లడించారు. అయితే 2023లో ఆమె మరణించారు.