Homeఅంతర్జాతీయంSri Lanka And Bangladesh And Nepal: మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్‌.....

Sri Lanka And Bangladesh And Nepal: మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్‌.. ప్రభుత్వాలను కూలుస్తున్న అమెరికా.. ఇక తర్వాత ఆదేశమే!

Sri Lanka And Bangladesh And Nepal: దక్షిణాసియా ప్రాంతంలో అమెరికా విదేశాంగ విధానం గత దశాబ్దాలుగా మార్పులు చెందుతోంది. భారతదేశ చుట్టూ ఉన్న దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్‌లో అమెరికా కారణంగానే రాజకీయ మార్పులు జరిగాయి. ప్రభుత్వాలే మారిపోయాయి. ఇటీవల బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోవడం, ముహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు – ఇవన్నీ అమెరికా ఆధిపత్య ఆకాంక్షలకు భాగంగా భావిస్తున్నారు. ఇప్పుడు అమెరికా కన్ను మయన్మార్‌పై పడినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వాల మార్పు..
బంగ్లాదేశ్‌లో 2024 ఆగస్టు 5న షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. విద్యార్థుల నేతృత్వంలో జరిగిన మాస్‌ ప్రొటెస్టులు, కోటా సిస్టమ్‌పై అసంతృప్తి కారణాలుగా చూపారు. అయితే, హసీనా ఆరోపణల ప్రకారం, అమెరికా ఈ మార్పులో కీలకంగా వ్యవహరించింది. సెయింట్‌ మార్టిన్‌ ద్వీపాన్ని (బంగ్లాదేశ్‌–మయన్మార్‌ సరిహద్దు సమీపంలో ఉన్న 3 చ.కి.మీ. పరిమాణంలోని కారల్‌ ఐలాండ్‌) అమెరికాకు ఇవ్వడానికి ఒత్తిడి చేసింది. ఈ ద్వీపం బెంగాల్‌ కాల్‌లో ఉండటం వల్ల, మాలక్కా స్ట్రెయిట్‌ వంటి ముఖ్యమైన సముద్ర మార్గాలను పర్యవేక్షించడానికి అమెరికాకు వ్యూహాత్మకంగా ముఖ్యం. హసీనా దీన్ని తిరస్కరించడంతో, యూఎస్‌ సంస్థలు, ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలపై ప్రభావం చూపి, హసీనా ప్రభుత్వాన్ని కూలగొట్టాయి. హసీనా దేశం విడిచి పారిపోయేలా చేశాయి. ఈ ద్వీపం చైనా బీఆర్‌ఐ (బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌) ప్రభావంలో ఉండటం వల్ల, అమెరికా దీన్ని చైనా ప్రతిఘటనగా ఉపయోగించాలని కోరుకుంది. 2012లో బంగ్లాదేశ్‌ అధికారాన్ని ధృవీకరించినప్పటికీ, మయన్మార్‌ రెబెల్‌ గ్రూపులు (అరకాన్‌ ఆర్మీ) దీనిపై క్లెయిమ్‌ చేస్తున్నాయి. హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత, యూనస్‌ ప్రభుత్వం అమెరికాతో సహకారాన్ని పెంచింది, ఇది ద్వీపంపై అమెరికా ఆసక్తిని మరింత పెంచింది. అయితే, అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఈ ఆరోపణలను ఖండించింది.

చిట్టగాంగ్‌లో అమెరికా సైనిక కార్యకలాపాలు..
చిట్టగాంగ్, బంగ్లాదేశ్‌ రెండవ పెద్ద నగరం. ప్రధాన ఓడరేవు, భారతదేశ తూర్పు రాష్ట్రాలు, మయన్మార్‌ సరిహద్దుల సమీపంలో ఉంది. యూనస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అమెరికా సైనిక చర్యలు ఇక్కడ పెరిగాయి. 2025లో జరిగిన ’టైగర్‌ లైట్‌నింగ్‌’, ’పేసిఫిక్‌ ఏంజెల్‌ 2025’ ఎక్సర్‌సైజ్‌లు దీనికి ఉదాహరణలు. ఈ వ్యాయామాలు కౌంటర్‌–టెర్రరిజం, డిజాస్టర్‌ రెస్పాన్స్, జంగిల్‌ వార్‌ఫేర్‌పై దృష్టి పెట్టాయి. షా అమానత్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో సీ–130జే సూపర్‌ హెర్క్యులస్‌ విమానాలు ల్యాండ్‌ అవుతున్నాయి, ఇవి యుఎస్‌ ఆర్మీ పసిఫిక్‌ కమాండ్‌కు చెందినవి. ఇది రహస్య సరుకులు (మయన్మార్‌ ప్రభుత్వానికి ముఖ్యమైన వస్తువులు) తీసుకువచ్చినట్లు సమాచారం. చిట్టగాంగ్‌ పోర్టులో అమెరికా కార్యకలాపాలు పెరగడం, ఈ ప్రాంతాన్ని మయన్మార్‌లోకి ప్రవేశ మార్గంగా మార్చడానికి సహాయపడుతోంది. ఈ చర్యలు భారతదేశ, మయన్మార్‌లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి, ఎందుకంటే ఇది రీజియనల్‌ సెక్యూరిటీకి ప్రభావితం చేస్తుంది.

మయన్మార్‌పై ఆసక్తికి కారణం ఆదే..
మయన్మార్‌లో అరేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ (ఆర్‌ఈఈ) డిస్‌ప్రోసియం, టెర్బియం వంటివి – ప్రపంచ సరఫరాలో 50%కి పైగా ఉన్నాయి. ఈ మినరల్స్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్, విండ్‌ టర్బైన్స్, మిలిటరీ టెక్నాలజీలకు కీలకం. చైనా ఇప్పటివరకు మయన్మార్‌ ఆర్‌ఈఈలను 90% ప్రాసెసింగ్‌ చేస్తూ, ప్రపంచ మార్కెట్‌ను ఆధిపత్యం చేస్తోంది. 2023లో మయన్మార్‌ ఆర్‌ఈఈ ఎగుమతులు 1.4 బిలియన్‌ డాలర్లకు చేరాయి, దీనిలో చాలా చైనాకు వెళ్లాయి. అయితే, 2021 కూటమి తర్వాత మయన్మార్‌లో జనతా వ్యాప్తి పోరు పెరిగింది. కచిన్‌ ఇండిపెండెంట్‌ ఆర్మీ (కేఐఏ), అరకాన్‌ ఆర్మీ వంటి రెబెల్‌ గ్రూపులు ఆర్‌ఈఈ మైనింగ్‌ బెల్ట్‌లను (చిప్వే–పాంగ్వా) ఆక్రమించాయి. ఇది చైనా సరఫరాను భంగపరిచింది. అమెరికా ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆర్‌ఈఈలపై దృష్టి పెట్టి, కేఐఏతో డీల్స్‌ చేయాలని ప్రతిపాదనలు చేస్తోంది. ఇది చైనా మోనోపలీని బ్రేక్‌ చేయడానికి, మయన్మార్‌లో రెజీమ్‌ చేంజ్‌ను ప్రోత్సహించడానికి ఉద్దేశం. భారతదేశం కూడా కేఐఏతో ఆర్‌ఈఈ సాంపిల్స్‌ కోసం మాట్లాడుతోంది. చైనా ఆధారపడటాన్ని తగ్గించడానికి.

పాకిస్తాన్, ఉక్రెయిన్‌లోనూ ఆర్‌ఈఈలు ఉన్నాయి, కానీ మయన్మార్‌లోని డిపాజిట్లు అత్యధికం, సులభంగా యాక్సెస్‌ చేయవచ్చు. అమెరికా ఈ వనరులను ఇండియా, ఇతర దేశాలతో షేర్‌ చేయకుండా, తమ ఆధిపత్యానికి ఉపయోగపడతాయి.

ఈ పరిణామాలు భారతదేశానికి ప్రత్యేకంగా ముఖ్యం. బంగ్లాదేశ్‌లో అమెరికా ప్రభావం పెరగడం, మయన్మార్‌ రెబెల్‌ గ్రూపులతో డీల్స్‌ – ఇవి భారతదేశ తూర్పు సరిహద్దులో అస్థిరత్వాన్ని పెంచుతాయి. చైనా ఆర్‌ఈఈలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారతదేశం కేఐఏతో మాట్లాడుతోంది, కానీ అమెరికా ప్రవేశం రీజియనల్‌ బ్యాలెన్స్‌ను భంగపరుస్తుంది. భారతదేశం మయన్మార్‌పై కన్ను పెట్టి, బంగ్లాదేశ్‌తో డిప్లొమసీ పెంచాలి. ఆర్‌ఈఈల కోసం చైనాకు ఒత్తిడి చేయడం, రెబెల్‌ గ్రూపులతో బ్యాలెన్స్‌ చేయడం అవసరం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version