Homeఅంతర్జాతీయంChina warns against US: ఇరాన్‌ను టచ్‌చేస్తే తీవ్ర పరిణామాలు.. అమెరికాకు చైనా జలక్‌..!

China warns against US: ఇరాన్‌ను టచ్‌చేస్తే తీవ్ర పరిణామాలు.. అమెరికాకు చైనా జలక్‌..!

China warns against US: వెనెజువెలాపై సైలెంట్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ అయిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యుద్ధ కాంక్షతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలో ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభంతో ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఖమేనీ ప్రభుత్వాని మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు, ఈమేరకు హెచ్చరికల మీద హెచ్చరికలు చేస్తున్నాడు. దీంతో నిరసనకారులు కూడా అమెరికావైపు ఆశగా చూస్తున్నారు. గతంలో ఒకసారి దాడి చేసిన అమెరికా ఈసారి పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమవుతోంది.

ఇరాన్‌వైపు యుద్ధనౌక..
అమెరికా అబ్రహం లింకన్‌ యుద్ధ నౌకను ఇరాన్‌ దిశగా పంపుతోంది. శుక్రవారానికి సిద్ధంగా ఉండాలని ఇరాన్‌ నౌకలను అడ్డుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇజ్రాయెల్‌ దళాలు కూడా అలర్ట్‌లో ఉన్నాయి. దీంతో అమెరికా ఇరాన్‌ డోమ్‌ యాక్టివేట్‌ చేసి, ఎయిర్‌ స్ట్రైక్‌లకు సిద్ధపడుతోంది. అమెరికాతో కలిసి దాడికి ఇజ్రాయెల్‌ కూడా రెడీ అయింది.

ఐఆర్‌జీసీపై అమెరికా చర్యలు
భూమిపై నుంచి దాడులు చేయకుండా ఎయిర్‌ స్ట్రైక్‌లు చేయాలని అమెరికా భావిస్తోంది. భూతల దాడులు చేస్తే ఐఆర్‌జీసీ అడ్డుకుంటుంది. అమెరికా సైనికులను చంపే ప్రమాదం ఉంది. అందుకే అమెరికా ఐఆర్‌జీసీని తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. ప్రపంచ దేశాలతోనూ ప్రకటింపజేసి ఇరాన్‌పై దౌత్యపరమైన ఒత్తిడి పెంచింది.

చైనా సంచలన ప్రకటన..
తాజా పరిణామాల నేపథ్యంలో చైనా సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌పై యుద్ధం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. పాలస్తీన, గత ఇరాన్‌ దాడుల సమయంలో ఇలాంటి స్టేట్‌మెంట్‌లు జారీ చేసింది. అయినప్పటికీ, ఇరాన్‌కు సరైన మద్దతు ఇవ్వకుండా బెదిరింపులకు మాత్రమే దిగుతోంది.

ఈ టెన్షన్‌ చమురు ధరలు, గ్లోబల్‌ ట్రేడ్‌ను ప్రభావితం చేస్తాయి. చైనా హెచ్చరిక అమెరికా వ్యూహాలను ప్రశ్నిస్తూ, మధ్యప్రాచ్య స్థిరత్వానికి సవాల్‌గా మారింది. దౌత్య ప్రయత్నాలు ఫలిస్తాయా అనేది ఆసక్తికరం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular