Nepal Protests: నేపాల్ తగలబడిపోయింది. ఇప్పట్లో ఆదేశం కోలుకునే అవకాశం లేదు. ఏర్పడే ప్రభుత్వం కూడా అంత సమర్థవంతంగా ఉండదు. రాజు పరిపాలనను అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని మీడియా సంస్థలు చెబుతున్నప్పటికీ.. అది అంత నిజం కాకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ జనరేషన్ జెడ్ తరం వీధుల్లోకి వచ్చి.. పరిపాలకులను తరిమి తరిమి కొట్టింది.. అవినీతి, బంధుప్రీతిని అడుగుదాక తొక్కింది. ఆవేశం ఎల్లకాలం ఉండదు. ఆవేశం సద్దుమణిగిన తర్వాత పరిపాలన నడుస్తూనే ఉండాలి. మనకు పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లో అల్లర్లు జరిగాయి. అక్కడి ప్రధానమంత్రి బతుకు జీవుడా అనుకుంటూ పారిపోయారు. మరి ఇప్పుడు నేపాల్ మరో బంగ్లాదేశ్ అవుతుందా.. లేక స్థిరమైన పరిపాలనతో కొత్త చరిత్ర వైపు వెళ్తుందా.. అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.
దానికంటే ముందు నేపాల్ దేశంలో చెలరేగిన అల్లర్లకు కారణం ఎవరు? యువతరం ఆగ్రహమే ఇంతటి దారుణానికి దారితీసిందా? ఈ స్థాయిలో గొడవలకు కారణమైందా? ఈ ప్రశ్నలకు తగ్గట్టుగానే జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాలను ప్రసారం చేసినప్పటికీ.. వాస్తవం మరొకటి ఉంది. నేపాల్ దేశంలో జరుగుతున్న ఆందోళనలకు హామీ నేపాల్ అనే ఎన్జీవో సంస్థ అధ్యక్షుడు సుడాన్ గురుంగ్ ప్రధాన కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2015 సంవత్సరంలో నేపాల్ దేశంలో భీకరమైన ప్రకృతి విపత్తు సంభవించింది. ఆ సమయంలో ప్రజలను ఆదుకోవడానికి అతడు ఒక ఎన్జీవో సంస్థను స్థాపించాడు. ఆ సంస్థకు అమెరికా నుంచి.. అక్కడ ఉన్న కంపెనీల నుంచి భారీ ఎత్తున నగదు వచ్చినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 8న నేపాల్ దేశంలో సోషల్ మీడియాపై నిషేధం విధించిన తర్వాత.. ఆందోళనలు ఎలా చేయాలో సూడాన్ వెల్లడించాడు. ఒక వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాని తర్వాత నేపాల్ లో పరిస్థితులు ఒకసారిగా మారిపోయాయి. ఊహించని విధంగా దారుణాలు చోటుచేసుకున్నాయి…
నేపాల్ దేశంలో ప్రస్తుతం జరిగిన దారుణానికి సుడాన్ ప్రధాన కారణం అని తెలుస్తోంది. అతని వెనుక అమెరికన్ కంపెనీలు ఉన్నాయని.. నేపాల్ దేశంలో విలువైన వనరులు దోచుకోవడానికి ఆ కంపెనీలు ఎప్పటినుంచో చూస్తున్నాయని.. ఇప్పుడు అనుకూల వాతావరణం.. అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడితే వాటి పని సులువు అవుతుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏర్పడే ప్రభుత్వం అమెరికా కను సన్నల్లో ఉంటుందని.. అందువల్లే తెర వెనుక ఇంతటి దారుణం జరిగిందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనాప్పటికీ సుడాన్ చేసిన ఒక వీడియో నేపాల్ దేశాన్ని మొత్తం వణుకు పుట్టించడం నిజంగా గమనార్హం.