AP Weather: ఏపీలో( Andhra Pradesh) విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. అదే స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఉక్కపోత, వేడి తీవ్రత కొనసాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో బంగాళాఖాతం నుంచి ఒక హెచ్చరిక వచ్చింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీవ్యాప్తంగా వర్షాలు పడే సూచన కనిపిస్తోంది. కొన్ని జిల్లాలకు అయితే భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ప్రధానంగా ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని చెబుతోంది. విశాఖ, అల్లూరి, సీతారామరాజు, అనకాపల్లి,కాకినాడలో తీవ్రత అధికంగా ఉండనుంది. ఈనెల 14 వరకు వర్షాలు ఉండబోతున్నాయని చెబుతోంది.
* ఈ జిల్లాల్లో వర్షం..
ఈరోజు చాలా జిల్లాలకు వర్ష సూచన( rain alert ) ఉంది. ప్రధానంగా అల్లూరి,ఏలూరు, ఎన్టీఆర్,గుంటూరు, బాపట్ల,పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి,కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది.
* వేసవి లా ఎండలు
ఇంకోవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే వేసవి( మాదిరిగానే ఉంది. ఉదయం 8 గంటలనుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండలు కాస్తుండడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు దాటుతున్నాయి. అయితే ఈ నెలాఖరు వరకు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. అయితే నదుల్లో నీటి ప్రవాహం అధికంగా ఉంది. ప్రాజెక్టుల్లో సైతం నీటి లభ్యత అధికంగా కనిపిస్తోంది. ఖరీఫ్ కూడా ఈ ఏడాది ఆశాజనకంగా. అయితే ఎరువుల కొరత రైతులను వేధిస్తోంది. సాగునీటిపరంగా ఇబ్బందులు లేకున్నా యూరియా దొరకక రైతులు అవస్థలు పడుతున్నారు. ఈనెల చివరి వరకు వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.