Ahmedabad Flight Fake Incident: సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకోవడానికి.. ఓవర్ నైట్ లో పేరు పొందడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అందులో కొంతమంది మాత్రమే విజయవంతమవుతున్నారు.
సోషల్ మీడియా వినియోగం పెరిగిపోవడం.. సోషల్ మీడియా ఆధారంగానే సెలబ్రిటీలు పుట్టుకురావటం.. ఒక్కసారి సెలబ్రిటీ అయిన తర్వాత డబ్బు సంపాదనకు కొదవ లేకపోవడంతో.. చాలామంది సోషల్ మీడియాను ఆదాయానికి వనరుగా మార్చుకుంటున్నారు. ఇక అన్ని కంపెనీలు కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారికి మాత్రమే ఎర్రతివాచి పరుస్తున్న నేపథ్యంలో.. సోషల్ మీడియాలో సెలబ్రిటీ కావాలని చాలామందికి ఆశ కలుగుతున్నది. ఇది తప్పు పట్టే విషయం కాకపోయినప్పటికీ.. చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి అడ్డగోలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే ఇప్పుడు ఈ జాబితాలో అహ్మదాబాద్ పట్టణంలో మృత్యుంజయుడుగా నిలిచిన వ్యక్తి కూడా ఉండడం విశేషం.
Also Read: Pawan Kalyan Report Card : పవన్ కళ్యాణ్ పాలన రిపోర్ట్ కార్డు ఎలా ఉంది?
అహ్మదాబాద్ ప్రమాదంలో బతికిన వ్యక్తి గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం విపరీతంగా ప్రచారం జరుగుతున్నది. అతడు సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం రూపొందించిన వీడియో ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నది. అయితే దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అతడు సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఫ్లైట్ నుంచి కింద పడ్డట్టు నాటకం ఆడడాని.. చివరికి అందర్నీ మోసం చేశాడని.. కొంతమంది వ్యాఖ్యానిస్తుండగా.. అతడు అందులోనే ప్రయాణించాడని.. ఆ ప్రమాదంలో తన సోదరుడిని కూడా కోల్పోయాడని మరికొందరి వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకొందరైతే మృత్యుంజయుడుగా నిలిచిన వ్యక్తి తన సోదరుడి అంత్యక్రియలకు కూడా హాజరయ్యాడని.. అతడు ఆ విమానంలోనే ప్రయాణిస్తున్నాడని.. అదృష్టం బాగుండి బతికిపోయాడని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అతడు బతికి రావడం పట్ల కొంతమంది హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరేమో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలలో మాత్రం విభిన్నమైన కథనాలు ప్రసారమవుతున్నాయి. విమానం కూలిన ప్రమాదంలో మృత్యుంజయుడుగా వచ్చిన వ్యక్తి వివరాలు లేవని తెలుస్తోంది. అయితే అతడు విమానంలో ప్రయాణించకపోయినప్పటికీ.. ప్రమాదం జరిగిన తర్వాత తాను అందులో నుంచి బయటపడ్డట్టు ప్రచారం చేసుకున్నాడని తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సిన అవసరం ఉన్నది. ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరామర్శించారు. మీడియా సంస్థలు కూడా అతడు 11 నంబర్ సీట్లో కూర్చోడం వల్ల బతికి బతకట్టాడని కథనాలలో ప్రసారం చేశాయి. అలాంటప్పుడు అతడు నాటకం ఎలా ఆడతాడని.. ఇదంతా కావాలని చేస్తున్న కుట్ర అని మరి కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయం మీద స్పష్టత రావాలి అంటే మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని మరికొందరు వాదిస్తున్నారు.