Homeఅంతర్జాతీయంAfghanistan Vs Pakistan: తప్పు ఒప్పుకున్న పాకిస్తాన్‌.. దోషిగా నిలబెట్టిన ఆఫ్గాన్‌!

Afghanistan Vs Pakistan: తప్పు ఒప్పుకున్న పాకిస్తాన్‌.. దోషిగా నిలబెట్టిన ఆఫ్గాన్‌!

Afghanistan Vs Pakistan: ఒకసారి చేస్తే తప్పు అంటారు.. మరోజారి జరిగితే పొరపాటు అంటారు.. కానీ పదే పదే చేస్తే అలవాటు అంటారు. పాకిస్తాన్‌ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. భారత్‌లో అల్లర్లు సృష్టించేందుకు చొరబాట్లను ప్రోత్సహించడం అలవాటైన దాయది దేశానికి ఇప్పుడు ఆఫ్గానిస్తాన్‌లోనూ చొరబడి దాడి చేసింది. అయితే ఆఫ్గాన్‌ సైన్యం దానిని అడ్డుకుంది. ఈ విషయాన్ని దోహాలో జరిగిన చర్చల సందర్భంగా ఆఫ్గానిస్తాన్‌.. పాకిస్తాన్‌ బట్టులు విప్పింది. దౌత్య పరాజయాల శ్రేణిలో తాజాగా మరో ఎపిసోడ్‌ జోడైంది. ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన శాంతి చర్చల్లో ఇస్లామాబాద్‌ తన సైన్యం సరిహద్దులు దాటి చొరబడ్డదని అంగీకరించక తప్పలేదు.

ఉగ్రవాద సంస్థ సాగుకుతో చొరబాటు..
తెహ్రీక్‌–ఎ–తాలిబాన్‌ ఉగ్రవాదుల దాడులు ఆఫ్గాన్‌ భూభాగంలో పెరుగుతున్నాయని ఇస్లామాబాద్‌ వాదిస్తున్నప్పటికీ, కాబూల్‌ మాత్రం ఈ సమస్య పుట్టుక పాకిస్తాన్‌లోనే ఉందని స్పష్టం చేసింది. ఆఫ్గాన్‌ ప్రతినిధులు ‘‘మీరు హద్దు దాటి వస్తే మేము అడ్డుకోకుంటే సైన్యం కూడా చొరబడేది. అదే విధంగా భారత్‌ కూడా పాకిస్తాన్‌లోకి వస్తే మీరు అడ్డుకోవడం సరికాదు కదా?’’ అని ఘాటు ప్రశ్నలు సంధించారు.

బద్రాంగ్‌ ఎయిర్‌బేస్‌పై పట్టుకోసమేనా?
అమెరికా సహకారంతో పాకిస్తాన్‌ బద్రాంగ్‌ ఎయిర్‌బేస్‌ చుట్టుపక్కల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించిందని తెలుస్తోంది. విదేశీ శక్తుల ఉనికిని చూపిస్తూ పాకిస్తాన్‌ చర్యలను సమర్థించుకోవడం దానికి మరింత అనుమానాల మబ్బులు ఏర్పరచింది. ఏ విదేశీ శక్తుల గురించి చెబుతున్నారో వివరించకపోవడం దాచిపెట్టే ప్రయత్నంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పాకిస్తాన్‌ సరిహద్దు ఉల్లంఘనపై కాబూల్‌ ప్రస్తుతం సంయమనంతో స్పందిస్తున్నా, ఈ పరిస్థితి ఎక్కువకాలం నిలవకపోవచ్చు. తాలిబాన్ల దాడులు కొనసాగితే ఆఫ్గాన్‌ మిలిటరీ ప్రతిగా బలప్రయోగానికి సిద్ధమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ దేశం ఒకసారి చర్యలు ప్రారంభిస్తే పాకిస్తాన్‌ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular