Greece : అమ్మా తల్లీ.. నువ్వు సరసలాడేందుకు అతడే దొరికాడా.. ఇప్పుడు చూడు ఎంత మంటలు మండుతున్నాయో

ఆ మంటల వల్ల దాదాపు 19,000 మందిని ఇతర ప్రాంతాలకు యుద్ధ ప్రాతిపదికన తరలించారు. ఇలా ప్రజలను తరలించడం ఆ దేశ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. ఆ సమయంలో ఐరోపా, ఇతర దేశాలు గ్రీస్ కు బాసటగా నిలిచాయి.

Written By: NARESH, Updated On : September 4, 2024 10:02 pm

A woman who set fire to romance fire officials

Follow us on

Greece : ఈ భూమండలం మీద ఒక్కో మనిషికి ఒక్కో తీరు కోరిక ఉంటుంది. ఆ కోరిక హద్దుల్లో ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ అది పరిధి దాటితే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. ఓ మహిళ కోరిక వల్ల ఏకంగా ఒక దేశమే మంటల్లో చిక్కుకుంది. ఆ మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చెమటోడ్చాల్సి వచ్చింది. అయితే ఆ అగ్ని ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు తెలిసి అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు.

యూరప్ ఖండంలోని గ్రీస్ దేశంలో కెరిసిటా అనే పేరుతో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో గత నెల 24, 25 తేదీలలో ఓ వ్యవసాయ భూమిలో భారీగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇప్పటికే ఆదేశం కార్చిచ్చు లతో నిత్యం మండుతూనే ఉంది. దానికి ఈ ప్రమాదం తోడు కావడంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు.. సంఘటన స్థలానికి చేరుకొని మంటలు తగ్గించారు. ఈ క్రమంలో ఈ ఘటనపై వారు దర్యాప్తు మొదలుపెట్టగా విస్మయకర వాస్తవాలు వెలుగు చూశాయి. అయితే ఆ వాస్తవాలు తెలిసిన తర్వాత అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.. వ్యక్తిగత సుఖాల కోసం అగ్ని ప్రమాదాలు కూడా చేస్తారా అని ముక్కున వేలేసుకున్నారు.

ప్రమాదం అందుకే జరిగిందట..

ఈ ప్రాంతానికి చెందిన ఓ 44 సంవత్సరాల మహిళకు అగ్నిమాపక సిబ్బంది మంటలు ఎలా ఆర్పుతారో చూడాలి అనుకుందట. అందువల్లే తన వ్యవసాయ భూమిలో చెత్తకు నిప్పు పెట్టిందట. మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందితో సరసాలు ఆడాలని అనుకుందట. అయితే ఆమె దిక్కుమాలిన సరసంతో అగ్నిమాపక అధికారులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ తర్వాత కేసు దర్యాప్తు చేసిన అనంతరం ఆమెను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఆమెకు 1,106 డాలర్ల అపరాధ రుసుము విధించారు. దానికి తోడు 36 నెలల పాటు జైలు శిక్ష విధించారు. యూరప్ ఖండంలోని ప్రత్యేక ప్రాంతమైన గ్రీస్ దేశంలో ఉద్దేశపూర్వకంగా మంటలు అంటించడం లేదా మంటలు రేగేందుకు కారణమవడం అక్కడి చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం. ఎందుకంటే గ్రీస్ దేశం పరిస్థితి దృష్ట్యా ప్రతి ఏడాది అక్కడ భారీగా కార్చిచ్చులు రగులుతుంటాయి.. పైగా జరిగే నష్టం కూడా అత్యంత తీవ్రంగా ఉంటుంది. అందువల్లే అక్కడి ప్రభుత్వం అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తుగా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటుంది. ఇక గత ఏడాది ఆగస్టు నెలలో గ్రీస్ దేశంలో కార్చిచ్చు వ్యాపించింది. ఆ మంటలు నగరంలోని శివారు ప్రాంతాలను బూడిద చేశాయి. ఆ మంటల తాకిడికి వేలాదిమంది ఆశ్రయాన్ని కోల్పోయారు. రోడ్స్, ఎవియా, కోర్ప్ ప్రాంతాలలో మంటలు పెను నష్టానికి కారణమయ్యాయి. ఆ మంటల వల్ల దాదాపు 19,000 మందిని ఇతర ప్రాంతాలకు యుద్ధ ప్రాతిపదికన తరలించారు. ఇలా ప్రజలను తరలించడం ఆ దేశ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. ఆ సమయంలో ఐరోపా, ఇతర దేశాలు గ్రీస్ కు బాసటగా నిలిచాయి.