Homeఎంటర్టైన్మెంట్Nayanthara : హీరోయిన్ నయనతార పరువు తీసేసిన అల్లు అర్జున్..ఇది మామూలు రివెంజ్ కాదు!

Nayanthara : హీరోయిన్ నయనతార పరువు తీసేసిన అల్లు అర్జున్..ఇది మామూలు రివెంజ్ కాదు!

Nayanthara : మన తెలుగు హీరోల ఎదుగుదల అంటే ఇతర ఇండస్ట్రీ హీరోలకు, హీరోయిన్లకు ఎందుకో అసలు ఇష్టం ఉండదు. వారి ముఖం లో విపరీతమైన అసూయ మన కళ్ళకు కనిపిస్తుంది. ఇటీవలే బాలీవుడ్ నటుడు అర్షద్ మన టాలీవుడ్ హీరో ప్రభాస్ పై చేసిన వ్యాఖ్యలు వాళ్ళ అసూయ కి ఉదాహరణ. అలాగే గతంలో నయనతార కూడా అల్లు అర్జున్ కి ఇలాంటి అవమానమే చేసింది. ఒక అవార్డ్స్ ఈవెంట్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిధి గా విచ్చేశాడు. నయనతార కి ఆయన చేతుల మీదుగా ఉత్తమ నటి అవార్డుని అందించాలి. కానీ ఆమె అల్లు అర్జున్ చేతుల మీదుగా అవార్డుని తీసుకునేందుకు ఇష్టపడలేదు. ఆయనకీ బదులుగా ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ విగ్నేష్ చేతుల మీదుగా నాకు ఈ అవార్డు ఇవ్వాలని యాంకర్ ని కోరింది.

సతీష్ విగ్నేష్ ఎవరో కాదు, ఇటీవలే ఆమె అతన్ని పెళ్లి కూడా చేసుకుంది. అయితే ఈ ఘటన జరిగిన సందర్భంలో పాపం అల్లు అర్జున్ చాలా ఫీల్ అయ్యాడు. ఆయన కళ్ళలో నుండి ఆరోజు నీళ్లు రావడమే తక్కువ అయ్యింది. అద్భుతమైన టాలెంట్ ఉన్న హీరో, సౌత్ లోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన హీరోకి ఇంతటి అవమానమా అని ఆయన అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. అయితే ఎక్కడైతే ఆయన తన గౌరవాన్ని పోగొట్టుకున్నాడో, తిరిగి మళ్ళీ అక్కడే సంపాదించుకున్నాడు. రీసెంట్ గా జరిగిన అవార్డ్స్ ఫంక్షన్స్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిథి గా విచ్చేశాడు. స్టైల్ గా స్టేజి మీద ర్యాంప్ వాక్ చేస్తూ నయనతార వైపు చూసి తల తిప్పుతాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ గా మారింది. ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూసేయండి. నయనతార కి తెలుగు హీరోలంటే చిన్న చూపు అనేది కొత్త విషయం కాదు. గతంలో ఆమె విక్టరీ వెంకటేష్ తో కూడా ఇలాగే ప్రవర్తించింది అని డైరెక్టర్ మారుతీ ఒక ఇంటర్వ్యూ చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేసాడు.

పాట చిత్రీకరణ కోసం డేట్స్ అడిగితే ఇవ్వలేదని, ఆమె కారణంగా ఒక పాటని చిత్రీకరించకుండానే వదిలేశామని చెప్పుకొచ్చాడు. అంతే కాదు ఆమె ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పాల్గొనేందుకు ఇష్టపడదు. అది చిరంజీవి సినిమా అయినా, షారుఖ్ ఖాన్ సినిమా అయినా, రజినీకాంత్ సినిమా అయినా ఇదే రూల్. ఒక సినిమాకి సంతకం చేసే ముందు ఆమె ప్రొమోషన్స్ చేయను అనే ఒప్పందం నిర్మాతలతో చేయించుకుంటుంది. ఒక హీరోయిన్ కి ఇంత పొగరు అవసరమా?, అల్లు అర్జున్ ఆమెకి సరైన రీతిలోనే సమాధానం చెప్పాడు అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నయనతార హీరోయిన్ గా కొనసాగుతూనే, మరోపక్క నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ బిజీ లైఫ్ ని గడుపుతుంది.

#alluarjun take #revenge On #ladysuperstarnayanthara
Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version