https://oktelugu.com/

MS Dhoni : బ్యాటింగ్ కు వచ్చేటప్పుడు ధోని ఆ సెంటిమెంట్ ఫాలో అవుతాడు.. అందుకే ఆ స్థాయిలో పేరు ప్రతిష్టలు

వచ్చే సీజన్ లో ధోని ఆడతాడో? లేదో? అనుమానంగా ఉంది. ప్రస్తుతం ధోని వివిధ కార్యక్రమాలలో అత్యంత ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. పలువురు మీడియా ప్రతినిధులకు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : September 4, 2024 / 10:09 PM IST

    Why does MS Dhoni follow the sentiment of looking at the sky while coming to bat

    Follow us on

    MS Dhoni : టీమిండియా దిగ్గిజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ సెంచరీ చేసిన వెంటనే తలకు ఉన్న హెల్మెట్ తీసేసి, చేతులకు ఉన్న గ్లౌజ్ తొలగించి ఆకాశం వైపు చూస్తాడు. దానికి కారణం లేకపోలేదు.. ఆకాశం పైన తన తండ్రి ఉంటాడని.. ఆయన ఆత్మకు శాంతి కలిగేందుకు.. తాను సెంచరీ చేసిన తర్వాత పైకి చూస్తాడు. అలాగే టీమ్ ఇండియా లెజెండరీ కెప్టెన్ ధోని కూడా ఆకాశం వైపు చూస్తాడు. అయితే దీనికి మొదట్లో సమాధానం తెలిసేది కాదు. కానీ ఇప్పుడు దానికి కారణం ఏంటో తెలిసింది.

    టీమిండియా కు వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనత మహేంద్రసింగ్ ధోనిది. అటువంటి ఆటగాడు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై తరపున ఆడుతున్నాడు. చెన్నై జట్టును అతడు ఐదు సార్లు విజేతగా నిలిపాడు. అంతేకాదు చెన్నై జట్టు తరఫున ఆడిన సమయంలో బ్యాటింగ్ లో అనేక ఘనతలు సొంతం చేసుకున్నాడు.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐపీఎల్ వరకు ధోని అనితర సాధ్యమైన రికార్డులను సాధించాడు. అయితే అతడు బ్యాటింగ్ కు వచ్చే క్రమంలో బౌండరీపై నిలబడతాడు. అదేపనిగా ఆకాశం వైపు చూస్తాడు. ఇలా ఎందుకు చేస్తాడనే విషయంపై చాలామంది ఆరా తీశారు. అయితే ఈ ప్రశ్నకు స్వయంగా ధోని సమాధానం చెప్పాడు. ” అలా ఆకాశం వైపు ఎందుకు చూస్తానో నాకూ పెద్దగా తెలియదు. ఇది నా జీవితంలో అతిపెద్ద గందరగోళమైన విషయం. బ్యాటింగ్ కు నేను వెళ్ళినప్పుడు బ్యాట్ చేత పట్టుకొని వేగంగా బౌండరీ లైన్ దాటుతాను. బౌండరీ లైన్ వద్దకు వచ్చినప్పుడు ప్రతిసారీ ఎడమ పాదాన్ని ముందు పెట్టాలా? కుడి పాదాన్ని ముందుకు పెట్టాలా? అనే ప్రశ్న నాలో వ్యక్తం అవుతుంది. మైదానంలో ఏ కాలు ముందు పెట్టాలనే విషయం నాకు అత్యంత మామూలే. కానీ ప్రతిసారీ నాకు ఇబ్బంది కర పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఎడమవైపున సూర్యుడు ఉండడం వల్లే నేను అలా చేస్తా కావచ్చు..డే అండ్ నైట్ మ్యాచ్ ల సందర్భంగా కొన్నిసార్లు ఆకాశం వైపు చూడడం నాకు అలవాటుగా మారింది. నాకు కుడి వైపు చూసే అలవాటు ఎప్పుడూ లేదు. నేను ఎక్కడికి వెళ్లినా నా చూపు ఎడమవైపు ఉంటుంది. పైగా అప్పుడప్పుడు నా భార్య ఎడమ వైపు కూర్చుటుంది. బహుశా అందువల్లే ఆ చూపు అటువైపు వెళ్తుంది కావచ్చు. ఒక్కో సారి నా భార్య అనుమతి లేకుండా బయటికి వెళ్తే దీంట్లో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని” ధోని వ్యాఖ్యానించాడు.

    ప్రైవేట్ ఈవెంట్లలో పాల్గొంటున్నాడు

    ధోని ప్రస్తుతం ప్రైవేట్ ఈవెంట్ లలో పాల్గొంటున్నాడు. త్వరలో నిర్వహించే ఐపీఎల్ లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్ అయిన వాళ్ళను అన్ క్యాప్ డ్ ఆటగాళ్లుగా కొనసాగించే నిబంధనను మళ్ళీ ఐపీఎల్ లో తిరిగి తీసుకురావాలని సీఎస్ కే యాజమాన్యం బీసీసీఐని కోరుతోంది. చెన్నై అభ్యర్థనను హైదరాబాద్, ఢిల్లీ, పంజాబ్ ఇతర జట్ల యాజమాన్యాలు తోసిపుచ్చుతున్నాయి. మరో వైపు తనను రిటైన్ చేసుకునే విషయంలో చెన్నై జట్టు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ధోని జాగ్రత్త పడుతున్నాడు. వచ్చే సీజన్ లో ధోని ఆడతాడో? లేదో? అనుమానంగా ఉంది. ప్రస్తుతం ధోని వివిధ కార్యక్రమాలలో అత్యంత ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. పలువురు మీడియా ప్రతినిధులకు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నాడు.