Australia beach terror attack: ప్రశాంతమైన ఆస్ట్రేలియా దేశంలో ఆదివారం చోటు చేసుకున్న ఉగ్రదాడి ప్రపంచ వ్యాప్తంగా కలకలాన్ని రేపింది. ఆస్ట్రేలియా ప్రభుత్వమైతే ఈ ఘటనతో ఒక్కసారిగా ఆందోళనకు గురైంది.. ఈ ఘటన జరిగిన తర్వాత అప్రమత్తమైన ఆస్ట్రేలియా ప్రభుత్వం వెంటనే శాంతి భద్రతల పరిరక్షణకు నడుం బిగించింది. ఈ ఘటన జరిగిన తర్వాత దర్యాప్తు మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ప్రభుత్వం… కీలక విషయాలను బయటపెట్టింది.
బొండి బీచ్ లో ఆదివారం యూదుల హనూక వేడుకలు జరుగుతున్నాయి. వారిపై సాయుధులైన ఇద్దరు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టింది తండ్రి కొడుకులని పోలీసులు దర్యాప్తులో తేలింది. వారిని నవీద్ అక్రమ్ (24), సాజిద్ అక్రమ్ (50) అని ఆస్ట్రేలియా పోలీసులు ప్రకటించారు. మీ ఇద్దరు పాకిస్తాన్ నుంచి వచ్చారని తెలుస్తోంది. అయితే భద్రత దళాలు కాల్పులు జరపడంతో సాజిద్ అక్కడికక్కడే చనిపోయాడు.
సాజిత్ పేరుమీద 2015లో తుపాకీ లైసెన్స్ నమోదయింది.. అంతేకాదు ఆస్ట్రేలియాలోని ఓ హంటింగ్ క్లబ్ లో సాజిద్ ఒక సభ్యుడుగా ఉన్నాడు. సాజిత్ వద్ద లైసెన్స్ తుపాకితోపాటు, మరో ఐదు ఆయుధాలు ఉన్నాయి.. నవీద్ ఆస్ట్రేలియాలోని సెక్యూరిటీ ఇంటలిజెన్స్ ఆర్గనైజర్స్ ఏజెన్సీ నిఘా రాడార్ పరిధిలో ఉన్నాడు. అయితే అతడు పెద్దగా మబ్బులు కలగజేసే అవకాశం లేకపోవడంతో ఆస్ట్రేలియా అధికారులు పెద్దగా పట్టించుకోలేదు.
ఆస్ట్రేలియా అధికారుల ఉదాసీనత కూడా వీరిద్దరికీ కలిసి వచ్చింది. అందువల్లే వారు బీచ్ లో కాల్పులకు పాల్పడ్డారు. మరోవైపు బోండీ బీచ్ లో జరిగిన దారుణంలో సాజిద్ తో పోరాడి.. అతడి దగ్గరనుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్న అహ్మద్ అల్ అహ్మద్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్ట్రేలియా అధికారులు సెయింట్ జార్జి హాస్పిటల్ తీసుకెళ్లారు. కష్టమొదటి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని అక్కడి వైద్యాధికారులు చెబుతున్నారు.. అహ్మద్ సాహాసాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందించింది. అతడికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అర్ బిల్ అక్మాన్ రివార్డ్ ప్రకటించింది.