Jagan vs Sanatana Dharma: దేశవ్యాప్తంగా ఇప్పుడు సమైక్యతా వాదం వినిపిస్తోంది. ముఖ్యంగా హిందుత్వ వాదం బలపడుతోంది. అది కచ్చితంగా వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. ఏపీలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి( YSR Congress party ) ఇది ప్రమాదకరమే. ఎందుకంటే ఆ పార్టీ చాలా తేలిగ్గా తీసుకుంటుంది కానీ.. హిందువులు క్రమేపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నారన్న విషయాన్ని గ్రహించుకోవడం లేదు. సనాతన ధర్మం వాదన పెరుగుతున్న కొలది ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. తనపై సనాతన ధర్మ అస్త్రం ప్రయోగిస్తున్నారన్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఇటీవల మతమార్పిడులు ఆరోపణలు వస్తోంది అందులో భాగమే.
ఉత్తరాది నుంచి ఇప్పుడు దక్షిణాదికి..
మతపరమైన రాజకీయాలు ఎప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో( North States) మాత్రమే జరిగేవి. అక్కడే మతాల ప్రభావం అధికంగా ఉండేది. అయితే క్రమేపీ దాంట్లో మార్పు వస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఆ సంస్కృతి విస్తరిస్తోంది. మొన్ననే తమిళనాడులో కార్తీకదీపం వెలిగించే విషయంలో ఒక వివాదం నడిచింది. కోర్టు వరకు వెళ్ళింది. అయితే ద్రవిడ సంస్కృతితో పాటు సెంటిమెంటును అస్త్రంగా చేసుకునేవి అక్కడి పార్టీలు. కానీ ఇప్పుడు మతపరమైన రాజకీయం కూడా తమిళనాడులో కనిపిస్తోంది. తమిళనాడులో హిందుత్వ వాదం కూడా రోజురోజుకు బలపడుతోంది. అలా రాజకీయం చేసి ద్రవిడ పార్టీలను ఎదుర్కోవాలని బిజెపి ఆలోచన చేస్తోంది.
వాటిని నివృత్తి చేయకపోతే..
వైసిపి హయాంలో మతమార్పిడులు ఎక్కువగా జరిగాయని ఒక ఆరోపణ ఉంది. అదే ఆరోపణ చేశారు విజయసాయిరెడ్డి. క్రిస్టియానిటీ ప్రోత్సాహం జగన్ హయాంలో ఎక్కువగా ఉండేదన్న ఆరోపణ ఉంది. అయితే క్రిస్టియానిటీ ప్రోత్సాహం లేక షర్మిల తో పాటు ఆమె భర్త దూరమయ్యారన్న వాదన ఉంది. కానీ వరుసగా తిరుమల వివాదాలు, ఆపై అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు తదితర కారణాలతో స్పష్టమైన మతం ముద్ర ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై. అందుకే ఆ పార్టీపై ఎటువంటి ప్రచారం జరిగిన ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఇప్పుడు సనాతన ధర్మం ప్రయోగం సైతం బలంగా వెళుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో హిందూ మత ప్రోత్సాహం పై ప్రచారం చేసుకోకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డికి నష్టమే. ఏదో ఉత్తరాది రాష్ట్రాల్లో మతం ప్రభావం చూపుతుంది అని తేలిగ్గా తీసుకుంటే.. అది అంతిమంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త పడుకుంటే జగన్మోహన్ రెడ్డికి నష్టం తప్పదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.