Kazakhstan Plane Crash: విమాన ప్రాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. నివారణకు విమానయాన సంస్థలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నాయి. అయినా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా కజకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వంద మందికిపైగా దుర్మరణం చెందారు. విమానం కూలుతున్న దృశ్యాలు కూడా అక్కడ ఉన్న స్థానికులు వీడియో తీశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాన్ని దారిమళ్లించినా ప్రమాదాన్ని నివారించలేకపోయినట్లు తెలిసింది.
ఏం జరిగిందంటే..
కజకిస్తాన్‌లో ప్రయాణికులతో వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైంది. విమానం గాల్లో ఉండగానే పైలట్ నియంత్రణ కోల్పోయింది. దీంతో నేరుగా భూమిపైకి దూసుకువచ్చింది. ఈ క్రమంలోనే భూమిని తాకగానే పేలిపోయింది. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన సమయంలో విమానంలో ప్రయాణికులు, ఎయిర్‌లైన్స్ సిబ్బంది 110 మంది ఉన్నారు. ఈ ఘోర ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కల్పోయారని తెలిసింది.
ధ్రువీకరణ..
కజకిస్తాన్ విమాన ప్రమాదాన్ని రష్యాకు చెందిన న్యూస్ ఏజెన్సీ ధ్రువీకరించింది. అజర్‌బైజాన్‌కు చెందిన విమానం ఆ దేశ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోజిన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపింది. గ్రోజ్‌నిలో దట్టంగా ఏర్పడిన పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్‌కు సమస్య ఏర్పడింది. ఈ క్రమంలోనే విమానాన్ని సిబ్బంది దారిమళ్లించారు. కానీ, ప్రమాదం నివారించలేకపోయారు.